Cold-Pressed Oil : వంటింట్లో మళ్లీ మొదలైన పాత తరం సంప్రదాయం..రిఫైన్డ్ ఆయిల్స్‌కు చెక్

Cold-Pressed Oil : సాధారణ రిఫైన్డ్ ఆయిల్ తయారీలో గింజల నుంచి ఎక్కువ మొత్తంలో నూనెను రాబట్టుకోవడానికి కెమికల్స్‌ను, ఎక్కువ టెంపరేచర్‌ను ఉపయోగిస్తారు.

Cold-Pressed Oil

మారిన లైఫ్‌ స్టైల్‌తో మన వంటింట్లోకి రకరకాల రిఫైన్డ్ ఆయిల్స్ ప్లాస్టిక్ ప్యాకెట్ల రూపంలో చేరిపోయాయి. కానీ, ఒకప్పుడు మన పూర్వీకులు రసాయనాల ఊసే లేని స్వచ్ఛమైన గానుగ నూనెలను మాత్రమే వాడేవారు. అందుకే అప్పట్లో వారంతా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు.

కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీంతో చాలామంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే గానుగ నూనె(Cold-Pressed Oil)లకు మార్కెట్‌లో మళ్లీ విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. డాక్టర్లు కూడా ప్రత్యేకించి ఈ నూనెలనే రికమెండ్ చేస్తున్నారు.

ఆ కాలంలో ఎద్దుల సహాయంతో చెక్కతో చేసిన పరికరాలను ఉపయోగించి పల్లీలు, నువ్వులు, కొబ్బరి వంటి వాటి నుంచి గానుగ నూనెను సేకరించేవారు. ఈ పద్ధతిలో ఆయిల్‌ను తీసేటప్పుడు ఎలాంటి వేడి పుట్టదు. దీనివల్ల గింజలలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు కూడా ఏమాత్రం నశించకుండా అలాగే ఉంటాయి.

అంతేకాకుండా ఈ నూనెతో వండే వంటలు అద్భుతమైన రుచితో పాటు.. ఎంతో మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. రసాయనాలు ఏమీ కలపకుండా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయడం వల్ల ఈ నూనె ఎక్కువ కాలం నిల్వ ఉన్నా కూడా ఏమాత్రం పాడవదు.

ఇప్పుడు మార్కెట్‌లో దొరికే సాధారణ పల్లీ నూనె ధర లీటరు రూ. 180 నుంచి రూ. 200 వరకు ఉంటే, గానుగ నూనె ధర మాత్రం రూ. 300 నుంచి రూ.400 పలుకుతుంది. దీని తయారీ పద్ధతి , నాణ్యత వల్లే ఇంత ధర ఉంటుంది. పది కేజీల పల్లీలను గానుగ పట్టిస్తే కేవలం 4 కేజీల నూనె మాత్రమే వస్తుంది.

Cold-Pressed Oil

సాధారణ రిఫైన్డ్ ఆయిల్ తయారీలో గింజల నుంచి ఎక్కువ మొత్తంలో నూనెను రాబట్టడానికి కెమికల్స్‌ను, ఎక్కువ టెంపరేచర్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల నూనె ఎక్కువ మోతాదులో వచ్చినా అందులోని పోషకాలన్నీ నశించిపోతాయి.

కానీ గానుగ పద్ధతిలో పట్టించే నూనె కోసం.. ఎలాంటి కల్తీ లేకుండా కేవలం నాణ్యమైన గింజలను మాత్రమే ఉపయోగిస్తారు. ధర కాస్త ఎక్కువగా ఉన్నా మన ఆరోగ్యానికి అందించే మేలుతో పోలిస్తే ఇది చాలా తక్కువని చెప్పాలి. రిఫైన్డ్ ఆయిల్ వాడి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే, స్వచ్ఛమైన గానుగ నూనెను వాడుకోవడం మంచిది.

Puri Jagannath Rath Yatra : పూరీ రథయాత్రలో విషాదం..తొక్కిసలాటలో భక్తుడు మృతి

Exit mobile version