Gold Silver Prices : ట్రంప్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Prices : సోమవారం జూన్ 15న నమోదైన మార్కెట్ వివరాల ప్రకారం చూస్తే.. దేశీయంగా పసిడి ధరల్లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి

Gold Silver Prices

అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం గోల్డ్ అండ్ సిల్వర్ ధరలపై(Gold Silver Prices) తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కొన్ని నెలలుగా టెన్షన్ పుట్టిస్తున్న అమెరికా , ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటన వెలువడటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అమెరికాతో పాటు ఇరాన్ కూడా ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ధృవీకరించాయి. ఈ ఒప్పందంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఎంతో కాలంగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడినట్లయింది. అయితే రెండు దేశాల మధ్య డీల్ జరిగిన వెంటనే గ్లోబల్ మార్కెట్ల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బులియన్ మార్కెట్లో పుత్తడితో పాటు వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి.

సాధారణంగా శాంతి ఒప్పందాల వల్ల మార్కెట్ ఒడిదుడుకులు తగ్గినా కూడా, వడ్డీ రేట్ల అంచనాలతో పాటు పెట్టుబడిదారుల సెంటిమెంట్ మారడంతో బంగారం ధరలు ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకెళ్లాయి.

సోమవారం జూన్ 15న నమోదైన మార్కెట్ వివరాల ప్రకారం చూస్తే.. దేశీయంగా పసిడి ధరల్లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌ ధరపై ఏకంగా రూ.2,450 పెరగగా.. 22 క్యారెట్ల జ్యువెలరీ గోల్డ్ ధరపై రూ.2,250 వరకూ పెరిగింది.

దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం రేటు భారీగా ఎగబాకింది. గ్లోబల్ మార్కెట్లో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన ఒక ఔన్సు గోల్డ్ ధరపై ఏకంగా 107 డాలర్లు పెరిగింది. ఈ భారీ పెరుగుదలతో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

గోల్డ్‌తో పాటే సిల్వర్ ధర కూడా ఊహించని స్థాయిలో షాకిచ్చింది. ఒక్కరోజే కేజీ సిల్వర్ ధరపై ఏకంగా రూ.10,000 పెరిగి ఝలక్ ఇచ్చింది. దీంతో ఈ నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై రూ.12,000 వరకు పెరిగినట్లయింది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోని మెయిన్ సిటీలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు చాలా ప్రాంతాల్లో ఈరోజు పుత్తడి ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.

Gold Silver Prices

ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,51,530 వద్ద కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1లక్ష38వేల 900 వద్దకు చేరింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోని రేట్లను పరిశీలిస్తే.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష51వేల680 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష39వేల50 వద్ద రన్ అవుతోంది.

ముంబైతో పాటు కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష51వేల 530 కు చేరగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష38వేల900 వద్ద ట్రేడవుతోంది.

Gold Silver Prices

ఇక దేశవ్యాప్తంగా సిల్వర్ ధరల విషయానికి వస్తే సిటీని బట్టి రేట్లలో కొంత తేడా కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నైలో కిలో వెండి ధర ఏకంగా రూ.2లక్షల80వేల మార్కును తాకింది.

ఢిల్లీ, ముంబై , బెంగళూరులో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2లక్ష70వేల వద్ద కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో పాటు కరెన్సీ మార్పిడి విలువల ఆధారంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు(Gold Silver Prices) రోజంతా మారుతూ ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు ఈ విషయాన్ని గమనించాలి.

Dry Fruits : ఏ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా? వేటిని కలిపి తింటే డేంజరో ఐడియా ఉందా?

Exit mobile version