H-1B Lottery
అమెరికా డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇన్నాళ్లూ అదృష్టం మీదే ఆధారపడి నడిచిన హెచ్-1బీ వీసా లాటరీ(H-1B Lottery) వ్యవస్థకు అమెరికా స్వస్తి పలకబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం లక్ మీద కాకుండా, వారి కెపాసిటీ, స్కిల్స్‌ను బేస్ చేసుకుని మాత్రమే వీసాలు కేటాయించే దిశగా యుఎస్ కాంగ్రెస్‌లో ఒక సంచలన కొత్త బిల్లు అడుగుపెట్టింది. ఈ బిల్లు కనుక అప్రూవల్ పొందితే దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వేలాది మంది భారతీయుల జాతకమే మారిపోబోతోంది.
అరిజోనా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ చట్టసభ మెంబర్ డేవిడ్ స్క్వీకెర్ట్ ఈ కొత్త ప్రపోజల్‌ను తెర మీదరకు తెచ్చారు. సెక్యూరింగ్ మైగ్రేషన్, అడ్రసింగ్ రిఫార్మ్, అండ్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ అండ్ రిటెన్షన్, అంటే స్మార్టర్ (SMARTER) యాక్ట్ పేరుతో ఈ చట్టాన్ని చట్టసభ ముందుకు తెచ్చారు. అమెరికాను కేవలం ఇంటర్నేషనల్ ట్యాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే టార్గెట్‌గా ఈ డ్రాస్టిక్ చేంజెస్ ప్లాన్ చేశారు.
ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఇకపై లాటరీలో వీసాలు రావు. ప్రతి అప్లికెంట్కు పాయింట్లను కేటాయిస్తారు. దరఖాస్తుదారుని ఏజ్, క్వాలిఫికేషన్, , ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై ఉన్న పట్టు, వారికి ఆఫర్ చేసే శాలరీ, అలాగే కెరీర్లో సాధించిన ప్రత్యేక విజయాలను బేస్ చేసుకుని ఈ పాయింట్ల స్కోర్ డిసైడ్ అవుతుంది. ముఖ్యంగా 26 – 35 ఏళ్ల లోపు ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్, హైలీ క్వాలిఫైడ్ నిపుణులు, అక్కడి రాష్ట్ర బేసిక్ ఇన్కమ్ కంటే భారీగా ప్యాకేజీలు అందుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎక్కువ పాయింట్లు వచ్చి పడతాయి.
ఈ పాయింట్ల సిస్టమ్‌ను పగడ్బందీగా మానిటర్ చేయడానికి ఐదుమంది ఎక్స్‌పర్ట్స్‌తో .. స్కిల్డ్ మైగ్రేషన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ టాలెంట్ బోర్డ్’ ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. ఆ సమయాలలో అమెరికాలోని జాబ్ మార్కెట్ పరిస్థితులు, అక్కడ ఉన్న ఉద్యోగుల కొరత, నిరుద్యోగ రేటు, జీతభత్యాలు , ఎకానమిక్ గ్రోత్ బేస్ చేసుకుని ప్రతి ఏటా ఎంతమంది విదేశీయులను అమెరికాలోకి రానివ్వాలో ఈ బోర్డే డిసైడ్ చేస్తుంది. ముందుగా ఏటా 85,000 వీసాలతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఎకనామిక్ కండిషన్స్‌ను బట్టి ఈ కౌంట్‌ను అడ్జస్ట్ చేసుకుంటారు.
ఈ ప్రపోజల్ భారతీయులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ప్లాన్లలో ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న దేశాలవారీ నెంబర్ లిమిట్‌ను అంటే కంట్రీ క్యాప్స్‌ను ఎత్తివేయాలని ఈ బిల్లు క్లియర్‌గా కోరింది. ఇది కనుక చట్ట రూపం దాలిస్తే, ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ క్యూలో ఉండిపోయిన భారతీయ టెక్కీలకు కొండంత రిలీఫ్ దొరికినట్లే అవుతుంది. అయితే టోటల్ వీసాల క్యాపింగ్ , కొత్త స్కోరింగ్ పద్ధతిపైనే భారతీయుల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.
మరోవైపు ఫ్యామిలీ బేస్డ్ వలసలను కేవలం లైఫ్ పార్ట్నర్, మైనర్ పిల్లల వరకే పరిమితం చేయాలని, మిగిలిన ఫ్యామిలీ మెయిన్ కేటగిరీలతో పాటు పాపులర్ డైవర్సిటీ వీసా లాటరీ(H-1B Lottery) ప్రోగ్రామ్‌కు పర్మినెంట్‌గా చెక్ పెట్టాలని ఈ ప్రపోజల్లో పేర్కొన్నారు. వీసా గడువు ముగిసినా కూడా అమెరికాలోనే ఉంటున్న వారిని పట్టుకోవడానికి ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోబోతున్నారు. అయితే ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల స్టేజ్‌లోనే ఉన్నాయి కాబట్టి.. ఇది పూర్తి స్థాయి చట్టంగా మారడానికి అమెరికా కాంగ్రెస్‌లో సుదీర్ఘ చర్చలు, అప్రూవల్ ప్రాసెస్ జరగాల్సి ఉంది.
Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?
