Indian Scientist : 14 ఏళ్ల యుద్ధం.. సిస్టమ్‌ని షేక్ చేసిన ఇండియన్ సైంటిస్ట్ కథ!

Indian Scientist : శివ చోప్రా సాధించిన విజయాన్ని ఏ శక్తీ తుడిచి పెట్టలేకపోయింది . ఇప్పుడు కెనడాలో దొరికే ప్రతి గ్లాస్ పాలు ఎలాంటి కెమికల్స్ లేకుండా వంద శాతం సేఫ్‌గా ఉన్నాయంటే

Indian Scientist

లంచాలు తీసుకోవడం, పాలకులకు లొంగిపోవడం, పై అధికారుల ఆర్డర్లకు జీ హుజూర్ అనడం చాలామందిలో చూస్తుంటాం. కానీ ఒక ఉద్యోగిగా ఉంటూ, ఒక పెద్ద మాఫియాకు ఎదురుతిరిగి నేను దేనికీ తలవంచను అని నిలబడటానికి మాత్రం చాలా గుండె ధైర్యం కావాలి.

అలాంటి ధైర్యాన్నే ప్రదర్శించి తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, కోట్లాది మంది ఆరోగ్యం కోసం ఏకంగా 14 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసిన ఒక అసాధారణ ఇండియన్ సైంటిస్ట్‌ది(Indian Scientist) ఇదే కథ .

కేవలం ఒకే ఒక్క సంతకం పెట్టడానికి డాక్టర్ శివ చోప్రా నేనీ పని చేయలేను అని చెప్పిన ఒక్క మాట, ప్రపంచ బులియన్ మార్కెట్ లాంటి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. ఒక్కడు అనుకుంటే ఎలాంటి కుళ్లిన సిస్టమ్‌నైనా ఎలా షేక్ చేయొచ్చో నిరూపించిన రియల్ లైఫ్ హీరో డాక్టర్ శివ చోప్రా .

డాక్టర్ శివ చోప్రా 1934లో ఇండియాలో పుట్టి, ఆ తర్వాత 1960 వ సంవత్సరంలో కెనడాకు వెళ్లారు. అక్కడ హెల్త్ కెనడా అనే గవర్నమెంట్ కంపెనీలో డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ చెక్ చేసే ఒక సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. మార్కెట్లోకి వచ్చే మెడిసిన్స్ సేఫ్ అయితే ఓకే అనడం, డేంజర్ అనిపిస్తే రిజెక్ట్ చేయడమే ఆయన డ్యూటీ.

సుమారు 20 ఏళ్ల పాటు డాక్టర్ శివ చోప్రా ఇలా తన పని తాను చేసుకుంటూనే వెళ్లారు. కానీ మార్కెట్లోకి మాన్‌శాంటో అనే ఒక గ్లోబల్ కెమికల్ కంపెనీ ఎంట్రీతో చిన్న తుపాన్ మొదలయింది.

మాన్‌శాంటో కంపెనీలో ఆవులలో పాలు విపరీతంగా పెంచే బోవిన్ గ్రోత్ హార్మోన్ అనే ఒక ఇంజెక్షన్‌ను తయారు చేశారు. అది ఆవులకు ఇస్తే 10 నుంచి 15 శాతం ఎక్కువ పాలను ఇస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీలకు, డైరీ ఫామ్స్‌కి కోట్ల కోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఇంజెక్షన్ అది.

అమెరికా లాంటి పెద్ద దేశం కూడా 1993లో మాన్‌శాంటో ఇంజెక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక కెనడా దేశం కళ్లు మూసుకుని సంతకం పెట్టేస్తుందని ఆ కంపెనీ లెక్కలు వేసింది.

కానీ ఎప్పుడైతే ఆ ఫైల్ డాక్టర్ శివ చోప్రా టేబుల్ ముందుకు వచ్చిందో, అక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ఇంజెక్షన్‌కు సంబంధించిన సైంటిఫిక్ రిపోర్టులను లోతుగా చదివిన శివ చోప్రాకు.. చదివిన కొద్దీ అందులో ఎన్నో మోసాలు, భయంకరమైన నిజాలు తెలిసాయి.

ఆ ఇంజెక్షన్ వల్ల ఆవులలో కుంటితనం రావడం, చనుబాల వాపు రావడం, అసలు పిల్లలు పుట్టే కెపాసిటీ కోల్పోవడంతో పాటు వాటి ఆయుష్షు పూర్తిగా తగ్గిపోతోందని తెలుసుకున్నారు. ఆవులకే అలాంటి దారుణమైన పరిస్థితి వస్తే, మరి ఆ పాలు తాగే చిన్న పిల్లల, మనుషుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఆయన మైండ్‌లోకి వచ్చింది. దీంతో దీనికి అప్రూవల్ ఇచ్చేది లేదంటూ ఆ ఫైల్‌ను రిజెక్ట్ చేశారు.

అక్కడితో పై అధికారులకు, కెనడా ప్రభుత్వానికి కోపం వచ్చింది. అమెరికానే ఓకే అన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం అంటూ ప్రెజర్ తెచ్చారు. ఫైల్స్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ నిజాలు బయటకు రానీకుండా నోరు నొక్కే ఆర్డర్స్ వేశారు. సస్పెన్షన్లు, డిమోషన్లు, ఎక్కడికో ట్రాన్స్‌ఫర్లు చేస్తూ ఆయనకు నరకం చూపించారు.

అయినా శివ చోప్రా లొంగలేదు. దీనికితోడు ఆయనతో పాటు మరో ఇద్దరు లాయల్ సైంటిస్టులు మార్గరెట్ హేడన్, జెరార్డ్ లాంబర్ట్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు.

చివరకు 1998లో కెనడా సెనేట్ దీనిపై విచారణ పెడితే, ఈ ముగ్గురు సైంటిస్టులు కోర్టు ముందు నిలబడి.. తమ పై అధికారులే తమను అన్‌సేఫ్ డ్రగ్స్‌ను అప్రూవ్ చేయమని బెదిరిస్తున్నారనే నిజాన్ని ప్రపంచం ముందు పెట్టారు. దీంతో ఆ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అయి, 1999లో కెనడా గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్‌ను బ్యాన్ చేయాల్సివచ్చింది.

ఆ తర్వాత యూరప్‌తో పాటు చాలా దేశాలు దానిని నిషేధించాయి. ఒక ఇమ్మిగ్రెంట్ సైంటిస్ట్(Indian Scientist), ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ కెమికల్ కంపెనీని మట్టికరిపించారు.

కానీ నిజాయితీగా ఉన్నందుకు పై అధికారుల మాట వినలేదన్న కారణాన్ని చూపిస్తూ ..35 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆ ముగ్గురు సైంటిస్టులను 2004 జూలై 14న ఒకే రోజు ఉద్యోగాల నుంచి పీకేశారు.

Indian Scientist

దీనికోసం శివ చోప్రా ఏకంగా 13 ఏళ్లు కోర్టుల్లో ఫైట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ 2017లో చివరి అప్పీల్ కూడా ఓడిపోయి,83 ఏళ్ల వయసులో 2018 జనవరిలో కన్నుమూశారు. ఆయనకు ఉద్యోగం తిరిగి రాలేదు, రావలసిన పెన్షన్ కూడా రాలేదు. కనీసం కెనడా గవర్నమెంట్ సారీ కూడా చెప్పలేదు.

కానీ శివ చోప్రా సాధించిన విజయాన్ని ఏ శక్తీ తుడిచి పెట్టలేకపోయింది . ఇప్పుడు కెనడాలో దొరికే ప్రతి గ్లాస్ పాలు ఎలాంటి కెమికల్స్ లేకుండా వంద శాతం సేఫ్‌గా ఉన్నాయంటే.. అప్పుడు ఒక ఇండియన్ సైంటిస్ట్(Indian Scientist) దేనికీ లొంగకుండా ఉండటమే కారణం.

US Iran Deal : ఇరాన్ కు అమెరికా బంపర్ ఆఫర్..300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

Exit mobile version