Indigo Flight Prices
సొంతూళ్లకు లేదా అర్జెంట్ వర్క్ గురించి వేగంగా వెళ్దామని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే సామాన్య, మధ్యతరగతి ప్రయాణీకులకు ఇండిగో గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఇప్పటికే ఫ్లైట్ ఛార్జీలు(Indigo Flight Prices) చుక్కలు చూపిస్తుంటే, త్వరలోనే మరింత టికెట్ రేట్లను పెంచడానికి ఈ ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. గ్లోబల్‌గా మారిన పరిస్థితులు, ఏవియేషన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు అడ్డగోలుగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండిగో సంస్థ ఏకంగా రూ. 1,879 కోట్ల భారీ నికర నష్టాన్ని మూటకట్టుకుంది. పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్, జెట్ ఫ్యూయల్ రేట్లు అనుకోని విధంగా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇండిగో సంస్థ చెల్లించాల్సిన ఫ్యూయల్ బిల్లు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఏకంగా 67.2 శాతం పెరిగి రూ. 9,967 కోట్లకు చేరుకుంది. దీనికి తోడు విదేశీ కరెన్సీ ముందు ఇండియా రూపాయి విలువ పడిపోవడం కూడా ఇండిగో నెత్తిన అదనపు భారాన్ని మోపింది.
ఇప్పటికే ఛార్జీలపై ఫ్యూయల్ సర్ఛార్జీలు వసూలు చేస్తున్నా కూడా, తాము కడుతున్న ఫ్యూయల్ బిల్లులో కేవలం 60 శాతం మాత్రమే రాబట్టగలుగుతున్నామని ఇండిగో మేనేజ్మెంట్ చెబుతోంది. పెరిగిన ఫ్యూయల్ భారాన్ని తట్టుకోవాలంటే టికెట్ రేట్లు పెంచడం తప్ప తమకు వేరే మార్గం లేదని సంస్థ సీఈవో వాల్ష్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ క్రూడ్ ఆయిల్‌తో పోలిస్తే జెట్ ఫ్యూయల్‌కు ఇచ్చే అదనపు ప్రీమియం (క్రాక్ స్ప్రెడ్) ఈ ఇయర్ అంతా సగటున 65 శాతానికి పైగానే ఉండటంతో కంపెనీ బాగా ఒత్తిడి ఎదుర్కొంటోంది.
రాబోయే రోజుల్లో కూడా విమాన ఫ్యూయల్ ధరలు పెరిగే సూచనలు కనిపించకపోవడంతో, ఆ ఎక్స్ట్రా భారాన్ని ప్రయాణికులపై ఎంతవరకు మోపవచ్చనే దానిపై ఇండిగో(Indigo Flight Prices) ప్రస్తుతం ఇంటర్నల్‌గా చర్చలు జరుపుతోంది. ఏది ఏమైనా ఇకపై ఇండిగో విమానాల్లో ప్రయాణించాలంటే కాస్త కాస్ట్లీ వ్యవహారంలాగే కనిపిస్తోంది.
