IndiGo : ప్రయాణీకులకు ఇండిగో బిగ్ షాక్.. ఆ ఛార్జీలన్నీ భారీగా పెరిగాయ్..

IndiGo : చూడటానికి ఫ్లైట్స్ బేసిక్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పూ లేనట్లే కనిపించినా, లోపల మాత్రం సర్వీస్ ఛార్జీలను ఇండిగో విపరీతంగా పెంచేసింది.

IndiGo

సొంత ఊరికో లేక బిజినెస్ పని మీదో ఫ్లైట్ ఎక్కి ప్రశాంతంగా వెళ్దామనుకునే డొమెస్టిక్ పాసింజర్ల జేబులకు విమానయాన సంస్థ ఇండిగో పెద్ద కన్నమే వేసింది. చూడటానికి ఫ్లైట్స్ బేసిక్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పూ లేనట్లే కనిపించినా, లోపల మాత్రం సర్వీస్ ఛార్జీలను విపరీతంగా పెంచేసింది. చంటి పిల్లలను తీసుకెళ్లడం నుంచి ఎక్స్‌ట్రా బ్యాగేజ్ వెయిట్ వరకు ప్రతి ఒక్కదానికీ ఇకపై అదనంగా డబ్బులు వదిలించుకోవాల్సిందే.

ఇండిగో ఎనౌన్స్ చేసిన ఈ కొత్త సవరణల్లో..ముఖ్యంగా చంటి పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులపై భారం పెరగడం చాలా దారుణం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి‌ మూడేళ్ల లోపు ఉన్న పిల్లలను పెద్దలు తమ ఒడిలో కూర్చోబెట్టుకుని జర్నీ చేయడానికి ఇప్పటివరకు రూ. 2,000 వసూలు చేయగా, దానిని ఇప్పుడు రూ. 3,000కి పెంచేశారు. అంటే ఎలాంటి స్పెషల్ సీటు ఇవ్వకపోయినా, కేవలం తమ చిన్నారిని తీసుకెళ్తున్నందుకు ఆ అదనపు వెయ్యి రూపాయల భారాన్ని బుకింగ్ సమయంలోనే చెల్లించాలన్న మాట.

ఇక లగేజీ విషయంలో కూడా ఇండిగో ఏ మాత్రం తగ్గలేదు. పరిమితికి మించి ఎక్స్‌ట్రా బ్యాగ్స్, వెయిట్ తీసుకెళ్తే ఇప్పటివరకు ప్రతి కిలోకు రూ. 700 వసూలు చేయగా.. ఇప్పుడు ఈ ఛార్జీని రూ. 800కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై ప్రయాణీకులు తీసుకెళ్లే ప్రతి అదనపు కిలోకు రూ. 100 ఎక్స్‌ట్రా చెల్లించుకోవాల్సిందే. దీనికి తోడు పెద్దల తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించే చిన్న పిల్లల సేఫ్టీ కోసం అందించే అన్‌అకంపనీడ్ మైనర్ సర్వీస్ ఫీజును కూడా రూ. 5,000 నుంచి ఏకంగా రూ. 5,999కి పెంచేశారు.

IndiGo

ఇండిగో(IndiGo) ఇక్కడితో ఈ బాదుడు ఆపలేదు. ఎయిర్‌పోర్ట్‌లో పొడవైన లైన్లలో నిలబడకుండా ఎర్లీగా చెక్-ఇన్ , బోర్డింగ్ పూర్తి చేసుకునే ప్రయారిటీ సర్వీసెస్ ఛార్జీలను రూ. 450 నుంచి రూ. 650కి పెంచేసింది. చివరికి మనం జర్నీ చేసినట్లు ఇచ్చే ట్రావెల్ సర్టిఫికెట్ ఫీజును కూడా రూ. 200 నుంచి రూ. 300కి పెంచేసింది.

డొమెస్టిక్ సర్వీసులన్నింటికీ వెంటనే వర్తించేలా ఇండిగో(IndiGo) తీసుకున్న ఈ సడన్ డెసిషన్ వల్ల, పండగలకు , వేరే అత్యవసర పనులపై ఫ్లైట్స్‌లో జర్నీ చేయాలనుకునే మధ్యతరగతి ప్రయాణీకుల మొత్తం ప్రయాణ బడ్జెట్ తలకిందులవ్వడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది.

Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..

Exit mobile version