Instagram : లాంగ్ వీడియోలతో ఇన్‌ స్టా రీ ఎంట్రీ..యూట్యూబ్ సామ్రాజ్యానికి చెక్ పెట్టగలదా?

Instagram : యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్ ఏకంగా 90 నిమిషాల లాంగ్-ఫార్మ్ వీడియో ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఫీచర్స్ పేరుతో వస్తున్న ఈ కొత్త అప్‌డేట్ ఏంటో చూడండి.

Instagram

సోషల్ మీడియా వరల్డ్‌లో ఎవరి కింగ్‌డమ్‌కు ఎప్పుడు ఎసరు వస్తుందో ఎవరూ ఊహించలేం. ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ కట్స్ చూసి బోర్ కొట్టేసిన ఆడియెన్స్‌ని కట్టేయడానికి .. ఇప్పుడు ఏకంగా వీడియో ఇండస్ట్రీకి బాస్ అయిన యూట్యూబ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాస్టర్ ప్లాన్‌తో ఎంట్రీ ఇస్తోంది. కేవలం కొన్ని క్షణాలు, నిమిషాల పాటు సాగే చిన్న వీడియోలతో సరిపెట్టకుండా, ఏకంగా గంటన్నర (90 నిమిషాలు) పాటు సాగే హారిజాంటల్ వీడియోలను వ్యూవర్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గతంలో తెచ్చిన ఐజీటీవీ బెడిసికొట్టినా, ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్‌తో ‘ఫీచర్స్’ (Features) అనే న్యూ ప్రాజెక్ట్‌ను సీక్రెట్‌గా టెస్ట్ చేస్తోంది.

అమెరికాలో కొంతమంది సెలెక్టెడ్ క్రియేటర్లను శాంపిల్‌గా తీసుకుని ఈ గంటన్నర వీడియో ఫార్మాట్‌ను ఇన్‌స్టా పరీక్షిస్తోందని ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ రివీల్ చేసిన న్యూస్ ఇప్పుడు టెక్కీ సర్కిల్స్‌లో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా పాడ్‌కాస్టర్లు, స్టాండప్ కమెడియన్‌లు, గంటల తరబడి ముచ్చటించే లాంగ్-ఫార్మ్ కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.

దీనిలో భాగంగా ఫేమస్ పాడ్‌కాస్ట్ హోస్ట్ ఎమ్మా గ్రెడే, బ్యూటీ క్రియేటర్ మోనెట్ మెక్‌మైఖేల్ వంటి టాప్ సెలబ్రిటీలు ఇప్పుడు ఇందులో పార్ట్ అయ్యారు. అంటే ఇకపై ఇన్‌స్టా అంటే కేవలం ట్రెండింగ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసే రీల్స్ అడ్డా మాత్రమే కాదు, కూర్చుని తీరిగ్గా చూసే లాంగ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌గా మారబోతోందన్నమాట.

అయితే ఇక్కడ ఇన్‌స్టా(Instagram) ఒక మాస్టర్ మైండ్ గేమ్ ప్లే చేస్తుంది. యూజర్లను తమ వైపు లాగడానికి వాళ్లు వాడిన టెక్నిక్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. మనం రోజూ స్క్రోల్ చేసే చిన్నపాటి నిలువు రీల్స్ మధ్యలోనే ఈ లాంగ్ వీడియోలకు సంబంధించిన లింక్స్ కూడా ప్రత్యక్షమవుతాయి.

అంటే ఉదాహరణకు ఒక గంట పాటు సాగే పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్లిప్‌ను రీల్స్‌లో చూస్తుంటే.. ఆ క్లిప్ నచ్చితే కనుక అసలు మ్యాటర్ ఏంటో ఫుల్‌గా చూడాలనిపిస్తే వెంటనే వేరే యాప్‌కి పరుగులు పెట్టాల్సిన పని ఉండదు. అక్కడ కనిపించే సింగిల్ క్లిక్‌తో మీరు డైరెక్టుగా ఆ గంట డ్యూరేషన్ ఉన్న పూర్తి వీడియోలోకి వెళ్లిపోవచ్చు. ఇకపై రీల్స్‌ను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లా కాకుండా, పెద్ద వీడియోలకు పవర్‌ఫుల్ గేట్‌వే లాగా కూడా వాడుకుంటున్నారన్నమాట.

ఒకప్పుడు ఇన్‌స్టా(Instagram)లో లాంగ్ వీడియోలు పేరు చెప్పగానే అందరికీ ఐజీటీవీ ఫెయిల్యూర్ గుర్తుకొచ్చేది. అప్పట్లో కేవలం ఫోటోలు, స్టోరీలకే జనాలు అతుక్కుపోయి ఉండటంతో అది బెడిసికొట్టింది. దాంతో ఆ ప్రయోగాన్ని పక్కనపెట్టి రీల్స్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.

కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. హెడేక్ వచ్చినా నాన్‌స్టాప్‌గా రీల్స్ చూడటానికి అడిక్ట్ అయిన జనాలకు ఈ కొత్త లాంగ్-ఫార్మ్ కంటెంట్ కచ్చితంగా నచ్చి తీరుతుంది. మరి లాంగ్ వీడియోలతో దునియాను దున్నేస్తున్న యూట్యూబ్ సింహాసానాన్ని.. ఇన్‌ స్టా(Instagram) ఎంతవరకు కదిలిస్తుందో, యూజర్లను ఏ రేంజ్‌లో కట్టిపడేస్తుందో కాలమే డిసైడ్ చేయాలి.

The Silence Of Men : ఐ యామ్ ఫైన్ వెనుక దాగున్న మగవారి సైలెన్స్..సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?

↑
Exit mobile version