Iran – America : ఇరాన్, అమెరికా చర్చలు విఫలం…మళ్ళీ యుద్ధం తప్పదా ?

Iran - America : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులకు తాత్కాలిక విరామం మాత్రమే వచ్చింది

Iran – America

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులకు తాత్కాలిక విరామం మాత్రమే వచ్చింది. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతారని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో వారి దేశంలోనే చర్చలు జరిగాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ బృందాల మధ్య.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలో తొలి విడత 2 గంటలపాటు చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇరు పక్షాలు ముగించాయి. చర్చల అనంతరం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.చర్చలు కొలిక్కి రాలేదని జేడీ వాన్స్ తెలిపారు.ఇరాన్ తమ షరతులు అంగీకరించడం లేదన్నారు. ఇరాన్(Iran – America) నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలన్నారు.ఎలాంటి అంగీకారం, ఒప్పందం లేకుండా అమెరికా తిరిగి వెళ్తున్నామని ప్రకటించారు.ఇది తమ కంటే ఇరాన్ కి బ్యాడ్ న్యూస్ అని జేడీ వాన్స్ తీవ్రంగా హెచ్చరించారు.

ఇరాన్ పెట్టిన కండీషన్లకు వారు తగ్గకపోవడం.. అమెరికా చేస్తున్న డిమాండ్లపై వాళ్లు కూడా తగ్గకపోవడంతో చర్చలు ఫలించలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇరాన్ వద్ద ఉన్న శుద్దిచేసిన యురేనియంను వదులుకోవాలి. ఇకపై అణు పరీక్షలు చేయకుండా హామీ ఇవ్వాలి.

Iran – America

దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు.అలాగే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు కూడా ఇరాన్ అంగీకరించలేదు. అటు ఇరాన్ డిమాండ్లకు అమెరికా తలొగ్గలేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అయితే తమ డిమాండ్లను ఇరాన్ అంగీరించిన తర్వాతే వీటి గురించి ఆలోచిస్తామని అమెరికా స్పష్టం చేసింది.

అటు చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ కూడాప్రకటన చేసింది.అమెరికా చేస్తున్న ఆమోదంయోగ్యం కాని డిమాండ్ల వల్లే చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ప్రకటించింది. తమ అణు హక్కులను వదులుకోబోమని, అలాగే హర్మూజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా చర్చల వైఫల్యంతో మరోసారి యుద్ధం మొదలయ్యే అవకాశముందని మిగిలిన దేశాలు భయపడుతున్నాయి.

Washing Machine : వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా? మీ ఇంటి వైరింగ్ సురక్షితమేనా?

Exit mobile version