Washing Machine : వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా? మీ ఇంటి వైరింగ్ సురక్షితమేనా?
Washing Machine : ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతీ పని కూడా ఫాస్టుగా చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఎలక్ట్రిక్ మెషీన్ల వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు.
Washing Machine
ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతీ పని కూడా ఫాస్టుగా చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఎలక్ట్రిక్ మెషీన్ల వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు.అయితే ఈ సౌకర్యాలే ఒక్కోసారి ప్రాణాలు తీసే ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్ మెషీన్(Washing Machine)లో బట్టలు వేసి అది రన్నింగ్‌లో ఉన్నప్పుడు దాని పని అది చేస్తుంది ఈలోగా స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుందని అనుకుని స్నానానికి వెళ్తుంటారు.
అయితే ఇది బయటకు సమయాన్ని ఆదా చేసే పద్ధతిలానే అనిపించినా, దీని వెనుక ఉన్న విద్యుత్ ప్రమాదాల గురించి తెలిస్తే మాత్రం వణికిపోవాల్సిందే. ఎందుకంటే విద్యుత్ పరికరాలు, నీటి కలయిక అనేది ఎప్పుడూ ప్రమాదకరమేనన్న ప్రాథమిక సూత్రాన్ని మనం ఇక్కడ విస్మరించకూడదంటారు నిపుణులు.
సాధారణంగా ఎలక్ట్రిక్ ప్రవాహమనేది తక్కువ నిరోధకత (Resistance) ఉన్న మార్గం గుండా ప్రవహిస్తుందన్న విషయం తెలిసిందే. వాషింగ్ మెషీన్(Washing Machine) లోపల ఉండే వైరింగ్ పాతబడటం వల్ల కానీ మోటార్లో వచ్చే టెక్నికల్ లోపాల వల్ల కానీ లీకేజీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ మన ఇంటి ఎర్తింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మాత్రం, ఆ ఎక్స్ట్రా పవర్ భూమిలోకి వెళ్లే దారి లేక నీటి పైపుల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. మనం స్నానం చేసే సమయంలో నీటి ధారను తాకగానే, మన శరీరం ఆ కరెంట్‌కు, భూమికి మధ్య ఒక వాహకంలా మారి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
ఈ రకమైన ప్రమాదాల నుంచి ఎప్పుడూ సేఫ్‌గా ఉండాలంటే మన ఇంట్లో రెసిడ్యూయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్( RCCB ) లేదా RCD అనే పరికరాన్ని అమర్చుకోవడం అత్యంత అవసరం. ఇది మీ ఇంటి ఎలక్ట్రికల్ సిస్టంలో ఉండే ఒక సెక్యూరిటీ గార్డు వంటిది. వైరింగ్‌లో ఎక్కడైనా చిన్నపాటి ఎలక్ట్రికల్ లీకేజీ జరిగినా లేక మనిషికి షాక్ తగిలే అవకాశమున్నా, ఇది కేవలం సెకనులో వందో వంతు కాలంలోనే పవర్‌ను పూర్తిగా నిలిపివేస్తుంది. కేవలం వాషింగ్ మెషీన్ మాత్రమే కాదు, గీజర్లు, ఇతర తడి ప్రదేశాల్లో వాడే ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల వచ్చే ప్రమాదాలను ఇది అడ్డుకుంటుంది.

అందుకే ఎప్పుడయినా సరే వాషింగ్ మెషీన్ పని పూర్తయ్యాక కనీసం 30 నిమిషాలు ఆగి స్నానానికి వెళ్లడం మంచిది. ఒకవేళ స్నానానికి అర్జంటుగా వెళ్లాల్సివస్తే రెసిడ్యూయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ పెట్టుకుంటే ఓకే కానీ లేకపోతే స్నానానికి వెళ్లే ముందు స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా ప్లగ్ సాకెట్ నుంచి తీసివేయడం వల్ల పూర్తి సేఫ్టీ లభిస్తుంది.
అలాగే ఐఎస్ఐ మార్కు ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను మాత్రమే వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో అన్న అనుమానం ఉంటే వెంటనే మంచి ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించుకోవడం మంచిది. అందుకే మనం పాటించే చిన్నపాటి జాగ్రత్తే మనల్ని, మన కుటుంబాన్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.





