America
అమెరికా-ఇరాన్ మధ్య ఐదు నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధం అత్యంత ఉద్రిక్త దశకు చేరుకుంది. ఇటీవలే కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమవడంతో, రెండు దేశాలు పశ్చిమాసియా వ్యాప్తంగా కొత్త ప్రాంతాల్లోకి యుద్ధాన్ని విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన వైమానిక దాడులు, క్షిపణి ప్రతిదాడులతో అక్కడి కీలక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడికి ప్రతీకారంగా అమెరికా(America) మిలిటరీ హెవీ వేవ్ పేరుతో దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై అత్యంత శక్తిమంతమైన వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన కమాండ్ సెంటర్లు, క్షిపణి-డ్రోన్ తయారీ కేంద్రాలు, తీరప్రాంత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. అటు ఇరాన్ కూడా ప్రతి దాడులు దీటుగానే చేస్తోంది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలోని యూఎస్ ఎయిర్‌బేస్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
ఇదిలా ఉంటే అమెరికా(America) ఆయుధ సంపద తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో రక్షణ దళాల వద్ద ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. భవిష్యత్తులో వేరే దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
యుద్ధానికి ముందు అమెరికా వద్ద 452 థాడ్ క్షిపణులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 278 కి పడిపోయింది. అంటే సగానికి పైగా నిల్వలు ఖర్చయ్యాయి. శత్రు క్షిపణులను గాల్లోనే కూల్చే ఈ అత్యంత అధునాతన వ్యవస్థ నిల్వలు 2,200 నుంచి కేవలం 827 కి తగ్గాయి. సుదూర లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణులను అమెరికా దాదాపు 1,000 కి పైగా ఇరాన్ యుద్ధంలో వాడేసిందిజ ఇది పదేళ్ల ఉత్పత్తితో సమానంగా చెబుతున్నారు.
కొన్ని సంవత్సరాలుగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా బిలియన్ల డాలర్ల విలువైన ఆర్టిలరీ రౌండ్లు, క్షిపణులను వన్-టు-వన్ పద్ధతిలో సహాయంగా పంపించింది. దీంతో వారి ఆయుధ సంపద తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే నెల రోజుల్లో యుద్ధం ముగించుకపోతే మాత్రం అమెరికా పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని యూఎస్ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Rashi Phalalu : వీరికి ప్రమోషన్ గ్యారంటీ.. ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం..
