Trump : ఇరాన్‌తో గ్రేట్ డీల్ కుదిరిందా? డొనాల్డ్ ట్రంప్ అన్నట్లు చారిత్రాత్మక ఒప్పందం జరగనుందా?

Trump : ఇరాన్‌ దేశంతో ఒక చారిత్రాత్మక ఒప్పందం తుది దశకు చేరుకుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి

Trump

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న యుద్ధ వాతావరణానికి అతి త్వరలోనే ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేలా ఒక సంచలన మైలురాయి సుమారు ఖరారయినట్లు తెలుస్తోంది.

ఇరాన్‌ దేశంతో ఒక చారిత్రాత్మక ఒప్పందం తుది దశకు చేరుకుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Trump) అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేవలం పేపర్ వర్క్ , సంతకాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయంటూ వైట్ హౌస్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఇలా చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ రెండు దేశాల మధ్య కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు, యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. అయితే వాటన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ ఒక అద్భుతమైన డీల్ సెట్ అయిందని చెప్పిన ట్రంప్(Trump).. రాబోయే కొన్ని రోజుల్లోనే డాక్యుమెంట్ల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అన్నారు. దీంతో ఇటీవల ఇరాన్‌పై జరగాల్సిన సైనిక చర్యలను అగ్రరాజ్యం సడన్‌గా ఆపేయడం వెనుకున్న అసలు సీక్రెట్ ఇదేనా అన్న చర్చ మొదలయింది.

ఈ రెండు, మూడు రోజులలోనే యూరప్ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై రెండు దేశాలు అఫీషియల్‌గా సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ట్రంప్(Trump) స్వయంగా వెళ్లకపోయినా కూడా, అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గనుక ఓకే అయితే.. ప్రపంచ దేశాల బిజినెస్‌కు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధి.. మళ్లీ పూర్తిస్థాయిలో ఓపెన్ అవుతుంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌కు మళ్లీ పెద్ద ఊరట లభిస్తుందని నమ్ముతున్నారు.

మరోవైపు ఈ భారీ ఒప్పందంపై ఇరాన్ గవర్నమెంట్ మాత్రం కాస్త ఆచి తూచి రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అమెరికాతో డిస్కషన్స్ బాగానే సాగాయని, అయితే ఇంకా ఫైనల్ డీల్‌ గురించి తాము పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి భిన్నంగా స్పందించడమే దీనికి కారణం.

అంతేకాదు వాషింగ్టన్ ప్రతిసారీ కొత్త కొత్త రూల్స్ తీసుకువస్తోందని, తాము ఎలాంటి ప్రెజర్‌కు లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తేల్చి చెప్పారు. తమ దేశ భద్రత, ప్రయోజనాల విషయంలో మాత్రం తాము ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.

Trump

కాగా ఈ మొత్తం డీల్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే.. ఇరాన్ ఎప్పటికీ కూడ అణ్వాయుధాలను తయారు చేయదని,అలాగే వేరే దేశాల నుంచి కొనుగోలు కూడా చేయదని తమకు గ్యారెంటీ దొరికిందని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎప్పటిలాగే తమ న్యూక్లియర్ ప్లాన్స్ అన్నీ కూడా కేవలం శాంతియుత అవసరాల కోసమేనని వాదిస్తోంది.

ఈ ఒప్పందానికి ఇరాన్ టాప్ లీడర్స్ కూడా పచ్చజెండా ఊపినట్లు అమెరికా అంటుండటంతో, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనడంతో పాటు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌కు చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఏదేమైనా ఇరాన్ నుంచి అధికారకంగా సంతకం తీసుకునే వరకూ ఈ గ్రేట్ డీల్‌పై ప్రపంచ దేశాలలో ఉత్కంఠ మాత్రం ఇలా కొనసాగేలా కనిపిస్తోంది.

Cluster Business : కాంపిటీషన్ ఉన్న చోటే కాసులు కురుస్తాయా? క్లస్టర్ బిజినెస్ ఫార్ములా ఎలా వర్కవుట్ అవుతుంది?

Exit mobile version