Nepal
హిమాలయాలలో మంచు చరియలు విరిగిపడి ఇళ్లు, గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయిన తీవ్ర విషాదం నుంచి నేపాల్ ఇంకా కొద్దిగా కూడా తేరుకోనే లేదు, అంతలోనే మరో ఊహించని విపత్తు వచ్చి పడింది. హిమానీనదం విస్ఫోటనం సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడటానికి స్థానికులు పోరాడుతుండగానే.. ఇప్పుడు భోటే కోశి నది రూపంలో మరో పెద్ద డేంజర్ పొంచి ఉంది.
నదిలో ఊహించని విధంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి పోతుండటంతో.. నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాల ప్రజలతో పాటు లోకల్ అధికారులు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా.. ఇప్పుడే ముందస్తు భద్రతా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.
టిబెట్ సరిహద్దు వద్ద మంచు కొండలు ఆగస్ట్ 26న హఠాత్తుగా కూలిపోవడంతో వచ్చిన సడన్ ఫ్లడ్స్ ధాటికి నేపాల్‌లోని చాలా గ్రామాలు సర్వనాశనమయ్యాయి. ఆ విషాదం నుంచి జనం కోలుకుంటున్న టైమ్‌లోనే భోటే కోశి నదిలో నీరు ఉధృతంగా పారుతూ వికృత శబ్దాలు వస్తున్నట్లు రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌కు ఆర్జెంట్ ఇన్ఫర్మేషన్ అందింది.
దీనిపై వెంటనే రియాక్టయిన ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ ( NDRRMA) తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రజలను హెచ్చరిస్తూ ప్రకటనలు రిలీజ్ చేసింది. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల పరిధిలోని ప్రజలంతా వెంటనే అలర్ట్ అయి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుందని తీవ్రమవుతుండటంతో ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ ( NDRRMA) వెంటనే మరో అత్యవసర పోస్ట్ చేసింది. రసువా వైపు భోటే కోశి నీటి ప్రవాహం మునుపెన్నడూ లేని స్థాయిలో శరవేగంగా పెరుగుతున్నట్లు రిపోర్టులు రావడంతో హెచ్చరికల తీవ్రతను పెంచింది.
దీనిలో భాగంగా రసువా, నువాకోట్, ధాదింగ్ తో పాటు చిత్వాన్ జిల్లాల్లో ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉండి రెస్క్యూ ఆపరేషన్లు, పునరావాస పనులు చేపడుతున్న రెస్క్యూ టీమ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందని గ్రహించి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో నేపాల్ గవర్నమెంట్ తీవ్ర ఆందోళనలో పడిపోయింది. మరింత నష్టం జరగకుండా రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది.
जिल्ला प्रशासन कार्यालय, रसुवाबाट भोटेकोशी नदीमा बाढीको बहाव बढेको आवाज सुनिएको भन्ने सूचना प्राप्त भएकोले रसुवा, नुवाकोट, धादिंङसम्म नदी आसपासको क्षेत्रमा सतर्कता अपनाउनु हुन अनुरोध गर्दछौं। थप जानकारी प्राप्त हुनासाथ थप अपडेट गर्दै जाने छौै।
— NDRRMA (@NDRRMA_Nepal) August 29, 2026
Soul After Death : మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి?
