Corona 2.0
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో, వార్తా ఛానల్స్‌లో ‘కరోనా 2.0’ గురించి వస్తున్న వార్తలు జనాలలో మరోసారి భయం మొదలయింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కొత్త కోవిడ్ వేరియంట్PJ.2.1 అంటే JN.1 లైనేజ్ రూపాంతరం చెందినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చి జనాలు ఆందోళనలకు గురవుతున్నారు.
కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దీనిని కొందరు ‘కరోనా 2.0′ అని చెబుతున్నా కూడా, వైద్య నిపుణులు మాత్రం మరీ అంత పానిక్ కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ నూతన వేరియంట్ లక్షణాలు ఇప్పుడు పెద్దగా తీవ్రంగా లేవని, ఇవి సాధారణ సీజనల్ ఫ్లూ లేదంటే పాత జలుబు మాదిరిగానే ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తీవ్రమైన గొంతు నొప్పి అంటే’రేజర్ బ్లేడ్’ టైప్ గొంతు మంట అలాగే జ్వరం, ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట ఈ వేరియంట్ ప్రధాన సంకేతాలుగా ఉన్నాయి.
గతంలో కరోనా అనగానే అందరికీ బాగా గుర్తొచ్చే వాసన కోల్పోవడం , రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త సబ్‌వేరియంట్‌లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అందువల్ల కేవలం లక్షణాలను బట్టే ఇది నార్మల్ ఫ్లూనా లేక కరోనా 2.0 నా అని తేల్చడం కష్టమని, క్లినికల్ టెస్టింగ్ మాత్రమే సరైన నిర్ధారణ ఇస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
అయితే కరోనా 2.0(Corona 2.0)తో మళ్లీ లాక్డౌన్లు, ఆంక్షలు ఉంటాయా అని చాలామంది భయపడుతున్నారు. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. మన శరీరం ఇప్పటికే వ్యాక్సిన్లు , గత ఇన్ఫెక్షన్ల ద్వారా తగినంత రక్షణ అంటే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించింది. అందుకే ఒకవేళ కరోనా అటాక్ అయినా కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
అయితే వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం కాస్త అలర్ట్‌గానే ఉండటం మంచిది. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజర్ మళ్లీ మెయింటెయిన్ చేయడం వంటి కనీస జాగ్రత్తలనను పాటిస్తే ‘కరోనా 2.0′(Corona 2.0) గురించి భయపడాల్సిన పనే లేదు.
