Pakistan
భారత్, పాక్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద గొడవలు ఇప్పుడు మళ్లీ పీక్ స్టేజ్‌కు చేరుకునే పరిస్థితులు తలెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రెండు దేశాల మధ్య ఇండస్ వాటర్స్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ఒకప్పుడు రెండు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా నిలిచిన 1960 నాటి ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో.. పాకిస్థాన్(Pakistan)కు అసలు సిసలు ముప్పు ముంచుకొచ్చిందని పాకిస్తాన్ గ్రహించింది. కాగా తాజాగా పాక్ రక్షణ శాఖ మంత్రి చేసిన కామెంట్లు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తమ దేశానికి వచ్చే నీటిని భారతదేశం కనుక అడ్డుకుంటే, యుద్ధానికైనా వెనుకాడబోమంటూ ఆయన డైరెక్టుగానే హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్‌గా నిలిచింది.
అసలు ఈ వివాదం ఇప్పుడు ముదరడానికి 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడే ప్రధాన కారణం . అమాయక పౌరులు, టూరిస్టులు, భద్రతా సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని జరిపిన ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణం వెనుక పాకిస్తాన్ మద్దతు ఉన్న సంస్థల హస్తం ఉన్నట్లు భారత్ బలంగా ఆరోపించింది.
సరిహద్దు దాటి వచ్చే ఎలాంటి ఉగ్రవాదాన్ని అయినా సరే పూర్తిగా అణచివేసే వరకు పాకిస్తాన్‌తో తమకు స్నేహపూర్వక ఒప్పందాలు ఉండవని తేల్చి చెప్పిన భారత ప్రభుత్వం.. 1960 నాటి చారిత్రాత్మక ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని (Indus Water Treaty) పూర్తిగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
భారత్ తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో పాకిస్తాన్ అప్పటి నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఆ అక్కసును, కోపాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒక ప్రముఖ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు. భారతదేశం తమ దేశానికి వచ్చే నీటి సరఫరాను అడ్డుకుంటున్నట్లు ఆధారాలు దొరికితే మాత్రం.. తమ జాతీయ భద్రత కోసం, సింధు జల సంరక్షణ కోసం భారతదేశంపై సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు.
ఇండియా నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటూ చీనాబ్ నది ప్రవాహాలను కంట్రోల్ చేస్తుందని, దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా తమకు ఇవ్వడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ కు భారత్ తీసుకున్న నిర్ణయంతో జరుగుతున్న పరిణామం మింగుడుపడటం లేదు.
అయితే పాక్ చేస్తున్న ఈ యుద్ధ హెచ్చరికలపై భారతదేశం ఎక్కడా తగ్గేదే లేదంటూ అంతర్జాతీయ వేదికపైనే గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో (UN) భారత ప్రతినిధిగా ఉన్న అనుపమా సింగ్ ఈ విషయంపై గట్టిగా క్లాస్ పీకారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, అమాయకుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్(Pakistan).. స్నేహం, ఒప్పందాల పేరుతో తమ హక్కులను ఎలా డిమాండ్ చేస్తుందని అనుపమా సింగ్ నిలదీశారు.అంతేకాదు 1960 నాటి సింధూ జలాల ఒప్పందానికి ఎప్పుడో కాలం చెల్లిపోయిందని ఐక్యరాజ్య సమితిలో ఆమె గుర్తు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న ఈ వాటర్ వెపన్ నిర్ణయం వల్ల పాకిస్తాన్(Pakistan) రక్షణ మంత్రి తీవ్ర అసహనానికి గురవడంతో.. మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న ఈ జలాల వివాదం.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా గమనిస్తున్నాయి.
Mind : సొసైటీలో నలుగురూ ఏది చేస్తే అది కరెక్ట్ అని మన సబ్‌కాన్షియస్ మైండ్ బలంగా నమ్ముతూ ఉంటుంది.
