NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో షాకింగ్ నిజాలు ..మాస్టర్ మైండ్స్‌తో ప్రూఫ్ రీడర్ల స్కెచ్

NEET Paper Leak : నీట్ పేపర్ లీకేజీ రాకెట్‌లో మొత్తం 13 మంది మెయిన్ విలన్లు ఉండటంతో వారిపై సీబీఐ ఛార్జిషీట్ ఫైల్ చేసింది.

NEET Paper Leak

లక్షలాది మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్న నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ(NEET Paper Leak) ఎపిసోడ్‌లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో ఉన్న భద్రతా లోపాలు ,లొసుగులనే ఆసరాగా చేసుకుని అసలు దందా నడిపినట్లు సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తేల్చి చెప్పింది.

అసలు పరీక్షా పేపర్ సెట్ చేసే ఆత్యంత సీక్రెట్ సెక్షన్‌కు వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి స్ట్రిక్ట్ తనిఖీలు లేకపోవడం పెద్ద లోపంగా తేలింది. పోనీ అక్కడ ఏమైనా రికార్డ్ అవుతుందా అంటే అదీ లేదు. అక్కడ సీసీటీవీ పర్యవేక్షణ కూడా దారుణంగా ఉండటంతోనే వారి పని చాలా ఈజీ అయిపోయింది. స్టూడెంట్స్ ఫ్యూచర్‌పై బాధ్యతగా ఉండాల్సిన ప్రూఫ్ రీడర్లే ఇలాంటి నీచమైన కుట్రకు దిగడం చూస్తుంటే అసలు వ్యవస్థలో ఏ స్థాయిలో లూప్ హోల్స్ ఉన్నాయో అర్థమవుతోంది.

ఈ మొత్తం దందా వెనుక ఎన్‌టీఏ రహస్య విభాగంలో పనిచేసిన ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు బ్యాక్ ట్రాన్స్‌లేషన్, ప్రూఫ్ రీడింగ్ వంటి పనులు చూసే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ నిపుణులు ముగ్గురు కూడా.. ఎగ్జామ్ కంటే ముందే క్వశ్చన్స్ బయటకు లీక్ చేశారు.

కెమిస్ట్రీ నిపుణుడు పి.వి. కులకర్ణి నీట్ పేపర్‌లోని ప్రశ్నలను చిన్న కాగిత ముక్కలపై రాసుకుని జేబులో వేసుకుని సీక్రెట్‌గా దాటేశాడు. కొన్ని కష్టమైన ప్రశ్నలను మైండ్‌లో గుర్తు పెట్టుకుని బయటకు వెళ్లాక పేపర్‌పై నోట్ చేసుకునేవాడు. కాన్ఫిడెన్షియల్ గదిలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఎలాంటి చెకింగ్ చేయకపోవడం ఇతనికి బాగా కలసివచ్చింది.

మరోవైపు బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మండారే రెండాకులు ఎక్కువే చదివింది. కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో క్వచ్ఛన్స్ అన్నీ చూసి హోటల్‌కు వచ్చాక, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లోని ఆ కాన్సెప్టులకు సంబంధించిన పేజీలను టిక్ చేసి, వాటి ఆధారంగా ఒరిజినల్ పేపర్‌లో ఉన్న ప్రశ్నలను అచ్చంగా రీ-క్రియేట్ చేసింది.

ఇక ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవాల్దార్ అయితే మరో అడుగు ముందుకు వేసి..తన మెమరీ పవర్‌కు ఎక్కువగానే పని చెప్పింది. తన డ్యూటీ పూర్తి కాగానే ఇంటికి వెళ్లి మరీ మైండ్‌లో ఉన్న ప్రశ్నలన్నింటినీ కూడా సేమ్ టు సేమ్ అలాగే పేపర్‌పై పెట్టేసింది.

NEET Paper Leak

ఇక ఎన్‌టీఏ హెడ్‌ ఆఫీస్‌లో వైఫల్యాలను కూడా సీబీఐ స్పష్టంగా ఎత్తి చూపింది. ఆఫీసులో సీసీటీవీల లైవ్ పుటేజ్‌ను మానిటర్ చేయడానికి ఎలాంటి స్పెషల్ కంట్రోల్ రూమ్ లేదు. దానికితోడు వీడియో రికార్డింగ్స్ కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే స్టోర్ అయ్యేలా ఉండటంతో, అసలు క్వశ్చన్ పేపర్లు తయారైన సమయానికి సంబంధించిన వీడియో ఎవిడెన్సులు ఏవీ దొరకలేదు.

మొత్తంగా నీట్ పేపర్ లీకేజీ రాకెట్‌లో మొత్తం 13 మంది మెయిన్ విలన్లు ఉండటంతో వారిపై సీబీఐ ఛార్జిషీట్ ఫైల్ చేసింది. కోర్టు ముందు 360 మంది సాక్షులు, 422 డాక్యుమెంట్లు, 43 కీలక ఎవిడెన్స్‌ను బలంగా ఉంచింది. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్‌తో మే 12న రంగంలోకి దిగిన సీబీఐ, అన్ని చోట్ల దాడులు చేసి ఆధారాలను సేకరించి..నిందితులందరినీ జైలుకు పంపేలా జుడీషియల్ కస్టడీకి పంపించింది.

Telangana Government : పేదలకు డబుల్ ధమాకా..అప్లై చేయకపోతే వెంటనే చేసుకోండి..

Exit mobile version