Prices Hike : మిడిల్ క్లాస్‌పై భారం తప్పదా? సోప్స్, ఆయిల్స్ నుంచి రీఛార్జ్ ప్లాన్స్ వరకు బాదుడు?

Prices Hike : ముడిసరుకుల ఖర్చు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో FMCG కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్‌కి మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.

Prices Hike

బియ్యం, పప్పులు, ఎల్పీజీ గ్యాస్, ఫ్యూయల్ ధరలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అతి త్వరలోనే మరో ఆర్థిక భారం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజువారీ జీవితంలో వాడే డైలీ ప్రొడెక్ట్స్ అయిన సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్లు ,ఇతర FMCG సరుకుల ధరలు గణనీయంగా పెరిగే(Prices Hike) అవకాశముందని ఆర్థిక విశ్లేషణ సంస్థలన్నీ గట్టిగా హెచ్చరిస్తున్నాయి.

దీనికి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు (Crude oil) ధరలు, సప్లై గొలుసులో ఏర్పడిన ఇబ్బందులే ప్రధాన కారణమని తెలుస్తోంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 113 డాలర్లకు చేరడంతో ప్రొడెక్ట్స్ తయారీతో పాటు ప్యాకేజింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి.

వీటికి తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల రా మెటీరియల్స్ ధరలు 74 శాతం వరకు పెరగడం FMCG కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పెరిగిన ప్రొడక్షన్ కాస్ట్‌ను తట్టుకోవడానికి ఈ భారాలను వినియోగదారులపైకి నెట్టడం తప్ప వేరే మార్గం లేదని క్రిసిల్, కొటాక్ నియో వంటి కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు టెలికాం సెక్టార్ నుంచి కూడా సామాన్యుడి జేబుకు చిల్లు పడే న్యూస్ వినిపిస్తోంది. డిసెంబర్ నాటికల్లా నెట్‌వర్క్ కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు, కమ్యూనికేషన్ ఛార్జీలను పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు అంబిత్ క్యాపిటల్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఓవైపు డైలీ లైఫ్‌లో వాడుకునే నిత్యావసరాలు, మరోవైపు ఫోన్ రీఛార్జ్ ఛార్జీలు ఒకేసారి ధరలు పెరగనుండటంతో రాబోయే రోజుల్లో మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Overly Emotional : ప్రతీ దానికి నొచ్చుకునే మనస్తత్వం..అతిగా ఫీలయ్యేవారి మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీ ..

↑
Exit mobile version