Salman Khan
రీసెంట్‌గా బి టౌన్‌ను కుదిపేసిన టైగర్ ష్రాఫ్ కాల్పుల ఇన్సిడెంట్‌లో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. అక్టోబర్ 18వ తేదీన జరిగిన ఈ అటాక్ వెనుక ఉద్దేశం ఏంటని ముంబై పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులకు అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖానేనని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హర్యానా షూటర్లు కొంతమంది సెప్టెంబర్ 20 వ తేదీ నాటికే ముంబైలో అడుగుపెట్టారు. అమీర్ ఖాన్ ఇంటి పరిసరాల్లో చాలా సార్లు రెక్కీలు నిర్వహిస్తూ అమీర్ కదలికలను నిశితంగా పరిశీలించారు. అయితే, అమీర్ ఎక్కువగా ఇంట్లోనే ఉండటం లేదా షూటింగ్స్ కోసం సిటీలో అందుబాటులో లేకపోవడంతో వారి స్కెచ్ అమలు చేయడం కష్టంగా మారింది. దీంతో చేసేదేం లేక షూటర్లు తమ ప్లాన్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బిష్ణోయ్ గ్యాంగ్ దాడి కుట్ర వెనుక బలమైన కారణాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది జులైలో గౌరీ స్పాట్‌ను అమీర్ ఖాన్(Salman Khan) పెళ్లి చేసుకున్న తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ రేంజ్‌లో బెదిరింపులు వచ్చాయి. ‘లవ్ జిహాద్’ను అమీర్ ప్రోత్సహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వాయిస్ నోట్లు వైరల్ అవడంతో అప్పట్లో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. అప్పుడు ఆ బెదిరింపులు నిజమేనని తేలడంతో, ఆ కోణంలోనే ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్కెచ్ వేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమీర్‌ను టార్గెట్ చేయడం సాధ్యపడకపోవడంతో వారి దృష్టి పబ్లిక్ ప్లేసులలో ఎక్కువగా కనిపించే టైగర్ ష్రాఫ్‌పై పడింది. అతడిని టార్గెట్ చేసుకోవడం తేలికని భావించి ఈ కాల్పులకు తెగబడ్డారు. ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ ఖాన్(Salman Khan)కు కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో సల్లూ భాయ్‌ను ఏమీ చేయలేకపోయిన ఈ గ్యాంగ్.. ఇప్పుడు మిగిలిన స్టార్లను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నెట్‌వర్క్ మొత్తాన్ని ఛేదించే దిశగా దర్యాప్తును స్పీడప్ చేశారు.
