Putin : భారత్ ఐటీ ప్రతిభకు రష్యా జోహార్లు..భారతీయుల కోడింగ్ నైపుణ్యాలను కొనియాడిన పుతిన్

Putin : సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్, జీ7 దేశాల కంటే బ్రిక్స్ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ప్రభావాన్ని పెంచుకుంటోందని గణాంకాలతో వివరించారు.

Putin

అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాల ఎకనమిక్ డామినెన్స్ మెల్లగా క్షీణిస్తోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్‌గా టెక్నికల్ రంగంలో భారతదేశానికి ఉన్న తిరుగులేని గ్లోబల్ పవర్‌ను ఆయన కొనియాడారు.

రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పుతిన్(Putin) మాట్లాడుతూ, అమెరికా నేతృత్వంలోని జీ7 దేశాల కంటే బ్రిక్స్ కూటమి.. ఏ విధంగా వరల్డ్ ఎకనమిక్ రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోందో కీలక గణాంకాలతో పాటు ఆయన వివరించారు. భారత్, రష్యాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం ఏ రకమైన అంతర్జాతీయ పొలిటికల్ ఒత్తిళ్లకు కూడా తలొగ్గబోదంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్‌ను ఒక తిరుగులేని శక్తిగా వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. అంతర్జాతీయ ఐటీ మార్కెట్‌లో భారత్ వహిస్తున్న అగ్రగామి పాత్రను ప్రశంసిస్తూ, టెక్నికల్ రంగంలో భారతీయుల మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా సాటిలేదన్నారు.

భారతీయ నిపుణులు ఎంతో ఉన్నత విద్యావంతులని, ముఖ్యంగా కోడింగ్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ అంశాలలో వారికున్న అద్భుతమైన నైపుణ్యాల వల్లే గ్లోబల్ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోందని ప్రశంసల వర్షం కురిపించారు. డిజిటల్ విప్లవంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ దేశాలు రోల్‌ మోడల్‌గా తీసుకోవాలనే అభిప్రాయాన్ని పుతిన్ వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఇంటర్నేషనల్ ఆర్థిక ముఖచిత్రంలో వస్తున్న పెను మార్పులను పుతిన్ వివరించారు. కొనుగోలు శక్తి ఆధారంగా చూసుకుంటే గ్లోబల్ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా ఇప్పటికే నలభై శాతానికి చేరుకోగా, జీ7 కూటమి వాటా కేవలం 29 శాతం కంటే తక్కువకు పడిపోయిందని గుర్తుచేశారు.

గడిచిన ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన వార్షిక ఆర్థిక వృద్ధిలో సుమారు సగం వాటా అంటే 49 శాతం కేవలం బ్రిక్స్ దేశాల వల్లే సాధ్యమయినట్లు, అదే సమయంలో జీ7 వాటా కేవలం 18 శాతానికే పరిమితమైందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రిపోర్టుల ప్రకారం రాబోయే రోజుల్లో పశ్చిమ దేశాల వృద్ధి రేటు ఒక శాతం దాటడం కష్టమని, కానీ బ్రిక్స్ దేశాలు నాలుగు శాతానికి పైగా వేగంతో దూసుకుపోనున్నాయని ట్రంప్ అంచనా వేశారు.

Putin

భారతదేశంతో ఉన్న లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్‌తో రష్యా అత్యంత పవిత్రమైన సోదర బంధంగా భావిస్తోందని పుతిన్ అన్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న భౌగోళిక సవాళ్లు, ఇంధన సంక్షోభాల వల్ల భారత్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తమ దేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గతంలో ఇంధన సరఫరాలపై కొన్ని ఆంక్షలు ఎదురైనప్పుడు.. రష్యా సంస్థలు భారతదేశానికి అండగా నిలిచాయని గుర్తుచేస్తూ, ఆసియా మార్కెట్‌కు తమ దేశం నుంచి ఇంధన ఎగుమతులు కంటిన్యూగా కొనసాగుతాయన్నారు. సేఫ్టీ, రక్షణ రంగాలతో పాటు సరికొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని కూడా భారత్‌తో నిరంతరం పంచుకుంటామని పుతిన్ క్లారిటీ ఇచ్చారు.

Liquor Prices : మందుబాబులకు భారీ షాక్..ఫుల్ బాటిల్‌పై రూ.120 వరకు పెంపు ?

Exit mobile version