Liquor Prices : మందుబాబులకు భారీ షాక్..ఫుల్ బాటిల్‌పై రూ.120 వరకు పెంపు ?
Liquor Prices : కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నట్లుగానే మద్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ధరలు ఫిక్స్ అయ్యాయి
Liquor Prices
మద్యం ప్రియులకు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మద్యం తయారీ కంపెనీల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరగడంతో..లిక్కర్ ధరలను(Liquor Prices) భారీగా పెంచడానికి రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
ముడిసరుకుల రేట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని.. అందుకే లిక్కర్ ధరలను(Liquor Prices) సవరించాలని కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతుండగా, ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలోనే పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధరల పెంపుదలపై ఎంత వరకూ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ..తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీ కొద్ది రోజులుగా మద్యం ఉత్పత్తిదారులతో వరుసగా చర్చలు కూడా జరిపింది. ఈ చర్చల ప్రకారంగా లిక్కర్ ధరలను(Liquor Prices) కనీసం 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని కంపెనీల ప్రతినిధులు గట్టిగా విన్నవించారు.
దీని ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై దాదాపు రూ. 80 వరకు, ప్రీమియం కేటగిరీ బ్రాండ్లపై రూ. 90 వరకు, అత్యంత ఖరీదైన హై-ఎండ్ బ్రాండ్ల ధరలపై ఏకంగా రూ. 120 పైనే అదనపు భారం పడే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే గతేడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను సవరించడంతో.. ఈసారి వాటి ధరల జోలికి వెళ్లడం లేదని తెలుస్తుంది.

ఈ త్రిసభ్య కమిటీ తన ఫైనల్ రిపోర్టును బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షించిన తర్వాత, రాబోయే 2,3 రోజుల్లో అధికారిక ఫైల్‌ను తెలంగాణ ప్రభుత్వ ఆమోదం కోసం పంపనుంది. సీఎంతో పాటు కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, జూన్ 15వ తేదీ నుంచే ఈ పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2,620 వైన్ షాపులు నడుస్తున్నాయి. ఈ తాజా ధరల పెంపుదల వల్ల ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా అదనంగా రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు రాబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వానికి సుమారు రూ. 2,400 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు ఎక్సట్రా ఇన్కమ్ సమకూరబోతోంది. రాబోయే వారం రోజుల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.
Dhakshinaamurthi : దక్షిణామూర్తి అంటే ఎవరు? ఈ అవతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?





