Strait Of Hormuz : ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్..2 రోజుల్లో హర్మూజ్‌ తెరుస్తామని ఆఫర్‌

Strait Of Hormuz : అమెరికా కనుక ఇప్పుడు తమ డిమాండ్లను అంగీకరిస్తే రెండంటే రెండే రోజుల్లో హర్మూజ్ జలసంధిని తెరవడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.

Strait Of Hormuz

పశ్చిమాసియాలో దాడులతో పాటు ప్రతిదాడులతో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇంకా తగ్గకపోవడంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కూడా తీవ్ర ప్రతిష్టంభనలో కూరుకుపోతున్నాయి. ఈ సంక్షోభానికి తెరపడాలంటే తాము విధించిన కండీషన్లకు అవతలి పక్షం లొంగాల్సిందే అంటూ రెండు దేశాలు కూడా పట్టుబడుతుండటం అంతర్జాతీయంగా ఆందోళన రేపుతోంది.

ఈ పరిణామాల మధ్య ఇంటర్నేషనల్ ఇంధన ట్రాన్స్‌పోర్ట్‌కు అత్యంత ముఖ్యమైన హర్మూజ్ జలసంధిని(Strait Of Hormuz) తిరిగి తెరిచే అంశంపై టెహ్రాన్ ఒక ఊహించని ప్రకటనను రిలీజ్ చేసింది. ఖతార్ ద్వారా గతంలో తాము పంపిన ప్రతిపాదనలను సవరిస్తూనే.. అమెరికా తమ షరతులకు ఒప్పుకుంటే కేవలం 2 రోజుల్లోనే జలసంధి గుండా ట్రాన్స్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ తెలిపారు.

ఫిబ్రవరి నెలలో అమెరికా,ఇజ్రాయెల్ దళాల జాయింట్ దాడులతో యుద్ధం మొదలైనా కూడా హర్మూజ్ జలసంధిని(Strait Of Hormuz) ఇరాన్ తన సంపూర్ణ అదుపులోకి తీసుకుంది. తమ పర్మిషన్ లేని ఓడలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుండటంతో, దీనికి చెక్ పెట్టడానికి అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టులపై ఫైనాన్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ దిగ్బంధనాన్ని విధించింది.

2025 సెప్టెంబరులో ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఒక వారం రోజుల ప్రణాళికను వాషింగ్టన్ ముందు ఉంచింది. దాని ప్రకారం ఇరాన్ ఆస్తులపై స్తంభన తొలగించడం, ఫ్యూయల్ ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం, అమెరికా దళాల విత్ డ్రా వంటి కీలక డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ షరతులకు అంగీకరిస్తే వారం రోజులు కాదని, 48 గంటల్లోనే భద్రత పునరుద్ధరిస్తామని ఇరాన్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.

మరోవైపు అమెరికాలో మిడ్‌టెర్మ్ ఎలక్షన్స్ సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై విమర్శల దాడిని పెంచారు. సెంట్రల్ ఇరాన్‌లోని పికాక్స్ పర్వత ప్రాంతంలోని మెయిట్ టార్గెట్‌లపై దాడి చేస్తామని బెదిరించడంతో టెహ్రాన్ ఘాటుగా రియాక్టయంది. తమ దేశ బోర్డర్స్‌ను, వనరులపై ఎలాంటి మిలిటరీ చర్యకు దిగినా దానికి వెంటనే అంతకుమించిన రేంజ్‌లో తిరుగులేని సమాధానం చెబుతామని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.

Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..

↑
Exit mobile version