Pulivendula : వైసీపీకి హైకోర్టు షాక్.. పులివెందుల మున్సిపల్ కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్..

Pulivendula : పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూడా రీపోలింగ్ జరిపి కౌంటింగ్ నిలిపివేయాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

Pulivendula

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల(Pulivendula) మున్సిపాలిటీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పులివెందుల ..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గం కావడంతో మొదటి నుంచీ కూడా అక్కడ పురపోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే ఆరోజు తాను వెళ్లిన చోట అవకతవకలు జరిగాయని జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. రీ పోలింగ్ నిర్వహిస్తేనే తాను ఓటేస్తానంటూ లేదంటే వేయనని ధర్నాకు కూడా దిగారు. కాగా అక్కడ కేవలం 4 వార్డుల్లోనే కాకుండా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని, అంతవరకు ఫలితాల కౌంటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విచారణలో కోర్టు ముందు వైసీపీ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ..పోలింగ్ రోజు అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. లోకల్‌గా సేకరించిన సీసీటీవీ విజువల్స్, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని పులివెందులలో మిగిలిన అన్ని వార్డుల్లో కూడా రీపోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వాలని,అలాగే కౌంటింగ్ కూడా ఆపాలంటూ కోర్టును అభ్యర్థించారు.

అయితే ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ ఈ వాదనలను పూర్తిగా తిరస్కరించారు. పోలింగ్ పూర్తయ్యాక కలెక్టర్, ఎస్పీలు ఇచ్చిన క్షేత్రస్థాయి రిపోర్టులు, కేండిడేట్స్ ఫిర్యాదులను నిశితంగా పరిశీలించిన తర్వాత తాము పులివెందులలో 4 వార్డులకు రీపోలింగ్ నిర్వహించామని, కాబట్టి మొత్తం మున్సిపాలిటీకే కౌంటింగ్ నిలిపివేయాల్సిన అవసరం లేదని వివరించారు.

రెండు వర్గాల వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి.. మంగళవారం ఉదయం తమ నిర్ణయాన్ని వెలువరించారు. వైసీపీ నేతలు వేసిన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనం… పులివెందులలో అన్ని వార్డుల్లో మళ్లీ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదని, ఏపీలోని ఇతర మున్సిపాలిటీలతో పాటే ఇక్కడ కూడా కౌంటింగ్‌ను కొనసాగించుకోవచ్చని చెప్పేరు. హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పులివెందుల(Pulivendula)లో కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది.

Gen Z Love Rules : నువ్వు లేకపోతే నేను లేను సీన్స్ బంద్..జెన్ జెడ్ సరికొత్త లవ్ రూల్స్ ఇవే..

↑
Exit mobile version