Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియలకు వేలాది సమాధులు..ఇరాన్‌లో ఏం జరగబోతోంది ?

Khamenei Funeral : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ హొస్సేనీ ఖమేనీ అంత్యక్రియలకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. తీవ్రమైన ఎండలు , భారీ జనసందోహం కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను తట్టుకోవడానికి ఈ ముందస్తు ఏర్పాట్లు చేసింది.

Khamenei Funeral

ఇరాన్ సుప్రీం లీడర్  అయతుల్లా అలీ హొస్సేనీ  ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించారు. కానీ దేశంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో అంత్యక్రియలు నాలుగు నెలల తర్వాత నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు అతిభారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా వెలువడిన సంచలన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ అధికారులు టెహ్రాన్‌లోని శ్మశానవాటికలో సుమారు 3,000 సమాధులను సిద్ధం చేశారు. ఓ సంచలన నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల ఊరేగింపులో సంభవించబోయే తొక్కిసలాట లేదా ఇతర ప్రమాదాల ముందస్తు జాగ్రత్త చర్యగా వీటిని సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ భారీ అంత్యక్రియలకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. తీవ్రమైన ఎండలు , భారీ జనసందోహం కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను తట్టుకోవడానికి ఈ ముందస్తు ఏర్పాట్లు చేసింది.

ఖమేనీ అంత్యక్రియలు(Khamenei Funeral) కోసం అతిపెద్ద భద్రతా, రవాణా ఏర్పాట్లు చేసారు. నివేదిక ప్రకారం టెహ్రాన్ అంతటా రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలను తరలించడానికి వేలాది బస్సులు, ఆహారం అందించడానికి తాత్కాలిక కిచెన్లు, వసతి కోసం పాఠశాలలు, మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. భారీ జనసమూహాలకు తోడు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఏ పరిస్థితికైనా దారితీయొచ్చనే ఆందోళనతో అక్కడి అధికారులు ఉన్నారు.

లక్షలాది మంది ప్రజలు, ఇరాన్ ఉన్నత నాయకులు హాజరుకానుండటంతో ఎలాంటి చిన్న దాడి జరిగినా ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయని భయపడుతున్నారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు కూడా వారిని వెంటాడుతున్నాయి.

Khamenei Funeral

2020లో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమాని అంత్యక్రియల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 56 మందికి పైగా మరణించారు. అలాగే 1989లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి నాయకుడు అలాగే ఆ దేశానికి తొలి సుప్రీం లీడర్ అయిన రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియల్లోనూ భారీ గందరగోళం జరిగింది.

అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా నివారించటానికి ఈ అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు. టెహ్రాన్ పురపాలక సంస్థ అంత్యక్రియల కోసం దాదాపు 15 మిలియన్ యూరోలను కేటాయించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు, బయటి నుంచి దాడులు జరగొచ్చనే అనుమానాలతో టెహ్రాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసి, సైనిక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

TRS : ఈసీ చేతిలో టీఆర్ఎస్ సెంటిమెంట్.. కవిత పార్టీ పేరు మార్పు ఎలాంటి టర్నింగ్‌లు తీసుకోబోతోంది?

Exit mobile version