Mysterious Places
ప్రపంచ పటంలో స్పష్టంగా కనిపిస్తున్నా, మనుషులు అడుగు పెట్టడానికి వీల్లేని కొన్ని రహస్య ప్రదేశాలు(Mysterious Places) మన భూమి మీద కొన్ని ఉన్నాయి. భౌగోళిక కారణాలు, ప్రమాదకరమైన జీవులతో పాటు అక్కడి ఆదివాసుల రక్షణ కోసం ప్రభుత్వం , అంతర్జాతీయ సంస్థలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా కఠినమైన నిషేధాన్ని విధించాయి.
భారతదేశంలోని ఉత్తర సెంటినెల్ ద్వీపం.. భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో భాగమైన ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్లేసులలో(Mysterious Places) ఒకటిగా నిలుస్తుంది.
ఇక్కడ నివసించే సెంటినెలీస్ అనే తెగకు చెందినవారు ఆధునిక ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా సరే ఈ ద్వీపంలోకి అడుగు పెట్టాలని చూస్తే, వారు బాణాలు, ఈటెలతో దాడులు చేస్తారు. ఈ ఆదివాసుల సంరక్షణ కోసం , వారి స్వచ్ఛమైన జీవన విధానాన్ని కాపాడటం కోసం భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ వెళ్లకుండా నిషేధాన్ని విధించింది.
బ్రెజిల్‌లోని ఇల్హా డా క్వెమాడా గ్రాండే లేదా పాముల ద్వీపం .. బ్రెజిల్ తీరానికి దగ్గరలో ఉండే ఈ ద్వీపాన్ని చూస్తే ఎవరికైనా ఎంత అందంగా ఉందో కదా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్లడం అంటే డైరెక్టుగా మృత్యువు నోట్లోకి వెళ్లడమే.
ఈ ద్వీపంలో సుమారు నాలుగు వేలకు పైగా అత్యంత విషపూరితమైన గోల్డెన్ లాన్స్‌హెడ్ జాతి స్నేక్స్ ఉన్నాయి. అక్కడి పాము కాటు వేస్తే మనుషుల చర్మం కూడా కరిగిపోతుందని చెబుతారు. అందుకే ఈ ద్వీపాన్ని ప్రజలకు పూర్తిగా నిషేధించి..కేవలం బ్రెజిల్ నౌకాదళం, ప్రత్యేక అనుమతి ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే పరిశోధనల కోసం అక్కడికి వెళ్లడానికి అర్హులు.
నార్వేలోని గ్లోబల్ సీడ్ వాల్ట్ .. నార్వే దేశంలోని ఒక మంచు కొండ లోపల నిర్మించిన ఈ ప్రాంతాన్ని ప్రపంచ వినాశన కాలపు నిధి అంటే డూమ్స్‌డే వాల్ట్ అని పిలుస్తారు.
భవిష్యత్తులో ఏదైనా అణు యుద్ధం, ఉల్కల దాడి , ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిపై ఉన్న పంటలన్నీ నాశనమైపోతే, మానవజాతిని ఆకలి నుంచి రక్షించడం కోసం ..కోట్లాది రకాల విత్తనాలను ఇక్కడ అత్యంత సురక్షితంగా దాచారు. దీని లోపలికి కేవలం అక్కడ పనిచేసే సిబ్బందికి, అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు తప్ప సాధారణ ప్రజలకు ప్రవేశం ఉండదు.
జపాన్‌లోని ఇసే గ్రాండ్ ష్రైన్ ..జపాన్ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆలయంగా భావించే ఈ ప్రదేశాన్ని చూడటానికి సాధారణ ప్రజలు నోచుకోరు.
ఇక్కడి ప్రధాన దేవాలయంలోకి కేవలం జపాన్ రాజకుటుంబానికి చెందిన వంశస్థులు , ప్రధాన అర్చకులకు మాత్రమే అక్కడ అడుగు పెట్టడానికి అనుమతి ఉంటుంది. సామాన్య భక్తులు, పర్యాటకులు కేవలం బయట ఉన్న చెక్క ఫెన్సింగ్ గోడల ద్వారా దూరం నుంచే ఈ ఆలయాన్ని చూసి నమస్కరించుకుంటారు.
ఉత్తర కొరియాలోని రూమ్ 39 ..ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ లో ఉండే ఒక రహస్య ప్రభుత్వ ఆఫీసే ఈ రూమ్ 39.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబానికి సంబంధించిన విదేశీ కరెన్సీ నిల్వలు, అంతర్జాతీయ లావాదేవీలు, అత్యంత రహస్యమైన ఆర్థిక వ్యూహాలన్నీ కూడా ఇక్కడి నుంచే నడుస్తాయని చెబుతారు. ఈ భవనంలోకి సామాన్య పౌరులకు కానీ, విదేశీయులకు కానీ ప్రవేశం ఉండదు.
HDFC : హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్..జులై 1 నుంచి మారనున్న ఈ రూల్స్
