Iran : ఆ ఒక్కటీ అడగొద్దు..యురేనియంపై తేల్చేసిన ఇరాన్

Iran : యురేనియంను విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని, అది తమ దేశంలోనే ఉండాలని ఇరాన్ తేల్చిచెప్పింది.

Iran

పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిపోయే దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఇరాన్(Iran) వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా యురేనియం(Uranium) అప్పగించే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ యూరేనియంను వదులుకోమని స్పష్టం చేసింది.

ఇరాన్(Iran) తో శాంతి ఒప్పందంపై ఇక సంతకాలే మిగిలాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఒప్పందంలోని కీలక అంశాలను కూడా వెల్లడించారు. దానిలో యురేనియంపై కీలక ప్రతిపాదన కూడా ఉంది. అయితే అణ్వాయుధాల అభివృద్ధి చేయవద్దంటూ పెట్టిన షరతుకు తాము అంగీకరించే సమస్యే లేదని ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది.

అణు కార్యక్రమంపై రాజీ పడే సమస్యే లేదని, తమ దగ్గరున్న యురేనియాన్ని అప్పగించబోమని స్పష్టం చేసింది.. యురేనియంను విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని, అది తమ దేశంలోనే ఉండాలని ఇరాన్ తేల్చిచెప్పింది.

ఈ నిల్వలను తగ్గించాలని, అప్పగించాలని అమెరికా డిమాండ్ చేయగా.. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆధ్వర్యంలో ఇరాన్ ఈ ప్రతిపాదనలను స్పష్టంగా తిరస్కరించింది. టెహ్రాన్ తన భూభాగం నుండి అంగుళం కూడా కదలనివ్వమని స్పష్టం చేసింది. ఒకవేళ తగ్గించాల్సి వస్తే, ఆ నిల్వలను ఇతర దేశాలకు ఇవ్వకుండా ఇరాన్ లోనే డైల్యూట్ చేసే ఏకైక మార్గానికి మొగ్గు చూపుతోంది.

ఇదిలా ఉంటే ఈ నిల్వలను అమెరికా బలగాలు చేజిక్కించుకుంటాయనే అనుమానంతో ఇరాన్ కీలక చర్యలు తీసుకుంది. తమ యురేనియం నిల్వ కేంద్రాల వద్ద ఉన్న సొరంగాలను మూసివేయడంతో పాటు దాని మార్గాల్లో మందుపాతరలు అమర్చినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చలు ఏ దశ వరకూ చేరతాయనేది తెలియడం లేదు.

Iran

అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో యురేనియం అప్పగింత కూడా ఉంది. మరి ఏ మాత్రం వెనక్కి తగ్గని ఇరాన్, అప్పగించాల్సిందేనంటూ అమెరికా పట్టుబడుతున్న వేళ చర్చలు పూర్తిస్థాయిలో సఫలమవుతాయో లేదో అనేది చూడాలి.
ఒక అంచనా ప్రకారం ఇరాన్ దాదాపు 11 టన్నులకు పైగా వివిధ స్థాయిలలో శుద్ధి చేసిన యురేనియంను నిల్వచేసింది.

దీనిలో అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిల్వలు ఇస్ఫహాన్ , ఇతర భూగర్భ అణు కేంద్రాలలో నిల్వ చేయబడినట్లు నిపుణులు భావిస్తున్నారు. అణుకార్యక్రమాలు నిలిపివేసేందుకు అంగీకరిస్తున్న ఇరాన్ యురేనియం నిల్వలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అమెరికాకు ఇవ్వదు.

Legal Notice : మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఎంపీ కొడుకు వార్నింగ్

Exit mobile version