US Iran Deal : ఇరాన్ కు అమెరికా బంపర్ ఆఫర్..300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

US Iran Deal : అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రకారం, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కోసం అమెరికా భారీ పెట్టుబడులు పునరావాస ప్యాకేజీని ప్రతిపాదించింది

US Iran Deal

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. ఇరాన్ , అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతిపాదనలకు ముందు నో అని చెప్పిన ఇరాన్ తర్వాత సానుకూలంగా స్పందించింది. దీంతో ఇరు దేశాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు చేయనున్నాయి.

ఇప్పటికే తుది ఒప్పందానికి ముందు అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే శాంతి ఒప్పందంతో ఇరాన్ కు అమెరికా(US Iran Deal) బంపర్ ఆఫర్ ఇచ్చింది. డీల్ పై సంతకాలు పూర్తయితే ఇరాన్ లో అగ్రరాజ్యం ఏకంగా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రకారం, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కోసం అమెరికా భారీ పెట్టుబడులతో పాటు పునరావాస ప్యాకేజీని ప్రతిపాదించింది. దీర్ఘకాలిక ఆంక్షల కారణంగా ఇరాన్‌లో అమెరికా పెట్టుబడులు లేకపోగా, తాజా ఒప్పందంతో ఈ పెట్టుబడులకు కొత్త మార్గం సుగమమైంది.

దాదాపు 300 బిలియన్లు అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతుండగా, ఈ భారీ ప్యాకేజీ ద్వారా ఇరాన్ చమురు, రవాణా రంగాలలో అమెరికా పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

US Iran Deal

ఇదిలా ఉంటే హార్మూజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచేందుకు, దాదాపు నాలుగు నెలలుగా ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించడానికి ఈ ప్యాకేజీని సిద్ధం చేశారు. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిపై ఆంక్షలతో ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి.

ఈ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది.

IND VS PAK : భారత్,పాక్ మ్యాచ్ క్రేజ్ఇదీ..స్టేడియానికి రికార్డు స్థాయిలో ఫ్యాన్స్

Exit mobile version