Aadhaar
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారుల కోసం మరో కొత్త మార్పును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు డిజిటల్ కాలంలో ఆధార్ కార్డు( Aadhaar) అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, మన ప్రతి ఆర్థిక లావాదేవీకి, ప్రభుత్వ పథకాలకు దీనినే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అయితే, చాలా మందికి ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ పోవడం లేదా మార్చుకోవాల్సి రావడం వల్ల ఓటీపీలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఏ ప్రదేశం నుంచైనా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును యూఐడీఏఐ త్వరలో కల్పించబోతోంద.
ప్రస్తుతం ఆధార్ కార్డు( Aadhaar)కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో..దగ్గరున్న ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, యూఐడీఏఐ ప్రవేశపెట్టబోయే ఈ కొత్త వ్యవస్థ ద్వారా మొబైల్ అప్‌డేట్ ప్రక్రియను మరింత ఈజీ చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఫేషియల్ రికగ్నిషన్’ (Facial Recognition) లేదా ‘ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్’ ద్వారా ఇంట్లో ఉండే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశముంది. రేపటి నుంచే ఈ సేవలు దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
యూఐడీఏఐ ఇప్పటికే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తో కలిసి ‘ఆధార్ మొబైల్ అప్‌డేట్ ఎట్ డోర్ స్టెప్’ సర్వీసులను అందిస్తోంది. ఈ కొత్త వ్యవస్థతో ఇది మరింత స్పీడప్ కానుంది. మీరు ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెడితే, పోస్ట్ మ్యాన్ మీ ఇంటి వద్దకే వచ్చి మొబైల్ నంబర్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేసేస్తారు. దీనివల్ల వృద్ధులు, గర్భిణీలు , గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ అయి ఉంటేనే మనం పాన్ కార్డు లింక్ చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకు అకౌంట్ తెరవడం వంటి పనులు ఈజీగా చేసుకోగలం. అంతేకాకుండా, అడ్రస్ మార్పులు వంటి ‘సెల్ఫ్ సర్వీస్’ పనులకు కూడా మొబైల్ ఓటీపీ అవసరం పడుతుంది. ఈ కొత్త ప్రక్రియ వల్ల సుమారు 140 కోట్ల మంది ఆధార్ కార్డు వినియోగదారులకు మేలు చేకూరబోతోంి
యూఐడీఏఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు అనే చెప్పొచ్చు. త్వరలో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ . ‘ఎం-ఆధార్’ (mAadhaar) యాప్‌లో దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేయనుంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను సేఫ్‌గా , ఈజీగా అప్‌డేట్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.
Erra Matti Dibbalu:విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు.. భూమి పుట్టినప్పటి ఆనవాళ్లు
