Vijayawada: విజయవాడలో 11 రోజుల కాన్సర్ట్ మారథాన్.. పూర్తి వివరాలు ఇవే!

Vijayawada:ఈ మహోత్సవం కేవలం సంగీతం, నాటకాలకే పరిమితం కాదు. ఇందులో అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

Vijayawada

విజయవాడ చరిత్రలో తొలిసారిగా, ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ అనే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక భారీ 11-రోజుల మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 22, 2025న మొదలై, అక్టోబర్ 2, 2025 వరకు జరిగే ఈ పండుగలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి.. మ్యూజిక్ కాన్సర్ట్ మారథాన్, సాంస్కృతిక మహోత్సవం, డ్రోన్ ఫెస్టివల్. ఈ కార్యక్రమాలు నగరాన్ని సాంస్కృతిక సౌరభాలతో నింపనున్నాయి.

ఈ మహోత్సవంలో ప్రధాన ఆకర్షణ విజయవాడ ఎక్స్‌పో, గొల్లపూడిలో జరిగే 11 రోజుల సంగీత కచేరీలు. ఇందులో భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో పేరున్న ప్రముఖులు పాల్గొంటారు. మణిశర్మ, ఆర్‌.పి. పట్నాయక్, కార్తీక్, సింగర్ సునీత, గీతా మాధురి వంటి గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. వీటితో పాటు రామ్ మిర్యాల, థైక్కుడమ్ బ్రిడ్జ్, క్యాప్రిసియో, జామ్ జంక్షన్ వంటి లైవ్ బ్యాండ్‌ల ప్రదర్శనలు కూడా ఉంటాయి.

Vijayawada

సంగీతంతో పాటు, ఈ మహోత్సవంలో సంస్కృతికి కూడా పెద్ద పీట వేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం , ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలలో 11 రోజుల పాటు నాటకాలు , నాటికలు ప్రదర్శిస్తారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పౌరాణిక నాటకాలైన ‘శకుని’, ‘ఖడ్గతిక్కన’, ‘కృష్ణ రాయబారం’ వంటివి ప్రదర్శిస్తారు. ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో ‘సత్యహరిశ్చంద్రం’, ‘రామాంజనేయ యుద్ధం’, ‘కృష్ణ తులాభారం’ వంటి నాటకాలు ప్రదర్శించబడతాయి.

Vijayawada

స్పాట్‌లైట్ కార్యక్రమాలు.. విజయవాడ కిరీటం(మిస్ & మిసెస్): సెప్టెంబర్ 25

Robotics: రోబోటిక్స్..భవిష్యత్తులో మనిషి, రోబో ఎలా కలిసి పని చేస్తారు?

Exit mobile version