Bill Gates:గేట్స్‌తో గ్రేట్ అన్పించుకున్న ఏపీ..బిల్ గేట్స్‌ పర్యటన ఎవరికి లాభం?

Bill Gates: పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో గేట్స్ బ్యాడ్మింటన్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది.

Bill Gates

ప్రపంచం మొత్తంగా ఆసక్తిగా గమనిస్తూ వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్(Bill Gates) ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. విజయవాడలో దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన గేట్స్ పర్యటన ఏపీ అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో గేట్స్ బ్యాడ్మింటన్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది.

బిల్ గేట్స్ఈ టూర్‌ను కేవలం ఒక పర్యటనలా కాకుండా, ఏపీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పర్యటన ముగించుకుని ఆయన విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. తన బిజీ షెడ్యూల్‌లో ఏపీకి రావడమే కాదు.. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న పురోగతిని చూసి బిల్ గేట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏపీని ఒక అద్భుతమైన రాష్ట్రంగా గ్రేట్ అని కొనియాడారు. టెక్నాలజీని సామాన్యుడి దగ్గరికి చేర్చడంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని గేట్స్ ప్రశంసించారు.

అయితే బిల్ గేట్స్ ( Bill Gates)ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన అవసరం ఏంటన్న ఆశ్చర్యం చాలామందిలో ఉంది.అయితే ఆయన ఏపీకి రావడానికి ప్రధాన కారణం ఆరోగ్యంతో పాటు వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ పార్టనర్ షిప్పే. అందుకే మెయిన్‌గా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార లోపాన్ని నివారించడంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న , వినూత్న పథకాలను గేట్స్ స్వయంగా పరిశీలించారు.

అంతేకాదు వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం ద్వారా రైతులకు అందుతున్నకొన్ని సర్వీసులను చూసి గేట్స్ కూడా ఫిదా అయిపోయారు. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, స్కూళ్లలో ఏఐ బోధన వంటి అంశాలన్నీ గేట్స్ ఫౌండేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో, ఫ్యూచర్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అలాగే సాంకేతిక సహకారం అందించడానికి గేట్స్ ఓకే చెప్పారు. ఏపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని బిల్ గేట్స్ మెచ్చుకోవడం ఏపీ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లే అయింది.

Bill Gates

మొత్తంగా బిల్ గేట్స్(Bill Gates) పర్యటన వల్ల ఏపీకి భారీగానే లాభం చేకూరినట్లు అయింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో మరిన్ని హెల్త్ సెంటర్లు, అత్యాధునిక ల్యాబ్‌లు ఏర్పాటుయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో విత్తనాల అభివృద్ధి, చీడపీడల నివారణకు బిల్ గేట్స్‌కు చెందిన.. గేట్స్ ఫౌండేషన్ నిధులతో పాటు ఇంటర్నేషనల్ టెక్నికల్ నాలెడ్జి కూడా ఏపీ రైతులు అందుకోబోతున్నారు.

బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి నాయకుడు ఏపీ వంటి రాష్ట్రాన్ని ప్రశంసించారంటే, అది అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఒక బలమైన ముద్రగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కి మరిన్ని ఐటీ , బయోటెక్నాలజీ సంస్థలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద బిల్ గేట్స్ విజయవాడ పర్యటన ఏపీలోని మానవ వనరుల వికాసానికి, సాంకేతిక అభివృద్ధికి ఒక కొత్త దిశను చూపించిందని చెప్పొచ్చు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version