Chandrababu : చంద్రబాబు సింగపూర్ మిషన్.. తొలి రోజే పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Chandrababu :సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి సుమారు 2,500 మంది తెలుగువారితో ఓపిగ్గా, ఆప్యాయంగా ఫోటోలు దిగారు.

Chandrababu : సింగపూర్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అపూర్వ స్పందనతో నిండిపోయింది. సింగపూర్‌తో పాటు సమీప ఐదు దేశాల నుంచి వేలమంది తెలుగువారు, ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి సుమారు 2,500 మంది తెలుగువారితో ఓపిగ్గా, ఆప్యాయంగా ఫోటోలు దిగారు. ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాలను, సమస్యలను నేరుగా ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ ఆత్మీయ కలయిక అక్కడి తెలుగువారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది.

Chandrababu

సీఎం చంద్రబాబు పర్యటన కేవలం తెలుగువారితో సమావేశానికే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. సింగపూర్‌(Singapore)లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సీఎం భేటీ అయ్యారు. సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామికవేత్తల్లో సీఎం చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక గుర్తింపును హైకమిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఏపీలో పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, సింగపూర్ కంపెనీల కోసం ప్రగతిశీలక విధానాలు అమల్లో ఉన్నాయని సీఎం వివరించారు. ముఖ్యంగా, గతంలో అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలగడానికి కారణమైన అపోహలను తొలగించి, రికార్డులను సరిచేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ భేటీలో హైకమిషనర్ ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం చంద్రబాబు(Chandrababu) వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాలు, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ వంటి ఆసియా పసిఫిక్ దిగ్గజ సంస్థల విస్తరణకు ఏపీలో అవకాశాలు ఉన్నాయని వివరించారు.

అలాగే అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి సీఎం వివరించారు. గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టాలని, “హౌసింగ్ ఫర్ ఆల్” ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం వారిని ఆహ్వానించారు.

మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో, ఏపీలో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. విశాఖ లేదా కృష్ణపట్నంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎవర్సెండై పరిశీలిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపింది.

మొత్తంగా, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడుల(Investments) అవకాశాలను తెచ్చిపెట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఒక శుభసూచకమని చెప్పవచ్చు.

Exit mobile version