Smart ration cards:స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ షురూ..

Smart ration cards: మొదటి విడతలో 53 లక్షల కుటుంబాలకు, ఆ తరువాత వివిధ దశల్లో మొత్తం అర్హులందరికీ ఈ కార్డులు అందజేస్తారు.

Smart ration cards

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా, ఆగస్టు 25, 2025 నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. పాత రేషన్ కార్డులకు భిన్నంగా, ఈ కొత్త స్మార్ట్ కార్డు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా, ఐదేళ్ల కాలంలో ఈ కార్డులు పంపిణీ చేయబడతాయి. మొదటి విడతలో 53 లక్షల కుటుంబాలకు, ఆ తరువాత వివిధ దశల్లో మొత్తం అర్హులందరికీ ఈ కార్డులు అందజేస్తారు.

ఈ కార్డు (Smart ration cards)కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్డులో ఉన్న ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా రేషన్ పొందిన వివరాలు, ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు అనే సమాచారం సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల బోగస్, నకిలీ కార్డుల సమస్య పూర్తిగా తొలగిపోతుంది.

ఈ కార్డు(Smart ration cards)లో కుటుంబంలోని సభ్యుల వివరాలు, వారి ఆధార్ ఆధారిత ఫోటోలు, మరియు ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉంటాయి. పాత కార్డులలో ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ కార్డులు నేరుగా ఇంటికే అందుతాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అనర్హులు రేషన్ సరుకులను పొందకుండా నివారించడానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల రేషన్ పంపిణీలో సమర్థత పెరుగుతుంది.డిజిటల్ ధృవీకరణ ద్వారా అందరికీ సరుకులు సులభంగా, సమయానికి పంపిణీ అవుతాయి. ఇది ప్రభుత్వ నియంత్రణను కూడా పెంచుతుంది.

ప్రతి కుటుంబానికి ఒకే స్మార్ట్ రేషన్ కార్డ్ (smart ration cards)ఇవ్వబడుతుంది. ఈ కార్డులో కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబంలో కొత్త సభ్యులు చేరినప్పుడు, వారి వివరాలను కూడా కార్డులో అప్‌డేట్ చేసుకోవచ్చు.

smart ration cards

కొత్తగా పెళ్లైన వారు లేదా ఇంట్లో కొత్తగా చేరిన సభ్యులు ఉంటే, వారి వివరాలు కూడా అదే కార్డులో జోడిస్తారు. ప్రభుత్వం 12 లక్షలకి పైగా కుటుంబాల నుంచి సవరించాలనుకున్న దరఖాస్తులు స్వీకరించి, దాదాపు 6.68 లక్షల కుటుంబాలను సవరించింది. ఒక్కొక్క కుటుంబానికి ఈ మార్పులు జరిగిన తర్వాత నెలకు 6 కిలోల బియ్యం అందించబడుతుంది

అంతేకాకుండా, ఈ స్మార్ట్ రేషన్ కార్డు (Smart ration cards) ఆసరా, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రజలకు పలు రకాల సేవలు పొందడానికి ఒకే కార్డు సరిపోతుంది. సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థను నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version