Ragging: ర్యాగింగ్ పేరుతో ఐరెన్ బాక్సుతో కాల్చిన తోటి విద్యార్ధులు..చట్టం ఏం చేస్తుంది..?

Ragging: భారతదేశంలో ర్యాగింగ్‌ను నివారించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. 2009లో సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నేరంగా పరిగణించాలని ఆదేశించింది.

Ragging

రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌లో జరిగిన ఘటన విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఉలిక్కపడేలా చేసింది. ర్యాగింగ్(Ragging) పేరుతో గుర్రం విన్సెంట్ ప్రసాద్ అనే విద్యార్థిని ఐరన్ బాక్స్‌తో కాల్చి, చిత్రహింసలు పెట్టిన సంఘటన వెలుగులోకి తెచ్చింది. స్నేహితులమని చెప్పుకునే కొంతమంది విద్యార్థులే ఈ అమానుష చర్యకు పాల్పడ్డారు.

ప్రస్తుతం ఆ బాధిత విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విద్యార్థుల మధ్య పెరుగుతున్న హింసాత్మక ధోరణులను, విద్యాసంస్థల్లో భద్రత లోపాలను ప్రశ్నిస్తోంది.

అసలు ర్యాగింగ్(Ragging) అంటే కేవలం సరదాగా ఆటపట్టించడం కాదు. అది పాఠశాలలు, కాలేజీల్లో కొత్త విద్యార్థులు లేదా బలహీనంగా ఉన్న వారిపై మానసిక, శారీరక వేధింపులకు పాల్పడటం. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం, భయాన్ని కలిగించడం , కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శారీరక, మానసిక బాధలకు దారితీస్తుంది.

భారతదేశంలో ర్యాగింగ్‌(Ragging)ను నివారించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. 2009లో సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నేరంగా పరిగణించాలని ఆదేశించింది. అలాగే, ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ పేరుతో ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. చాలా రాష్ట్రాలు కూడా ర్యాగింగ్ నిషేధ చట్టాలను అమలు చేస్తున్నాయి. అయినా కూడా, రాజమండ్రిలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పాటు, ఐఐటీ, ఎన్ఐటీ వంటి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా ర్యాగింగ్ కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు, తీవ్ర గాయాల వంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.

 

Bigg Boss:బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఒక ఆట ఆడుకుంటున్న నవదీప్

ఈ ఉదాహరణలు చట్టాలు ఉన్నా సరే, అవి పూర్తిగా అమలు కావడం లేదని స్పష్టం చేస్తున్నాయి. చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బాధిత విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి భయపడతారు. ఫిర్యాదు చేస్తే భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వారికి ఉంటుంది.

చాలా విద్యాసంస్థలు తమ పేరు చెడిపోకూడదనే ఉద్దేశంతో ఇలాంటి ఘటనలను బయటకు రాకుండా దాచిపెడుతున్నాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ర్యాగింగ్ యొక్క తీవ్రత గురించి సరైన అవగాహన ఉండటం లేదు. చాలా మంది దీనిని ఒక సాధారణ విషయంగా భావిస్తున్నారు. ర్యాగింగ్‌ను “సరదా”గా చిత్రీకరించే ధోరణి సమాజంలో ఇప్పటికీ ఉంది.

ఈ సంఘటనలు కేవలం మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే హానికర అంశాలుగా అంతా భావించాలి. అందుకే, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి.

 

Exit mobile version