Tirumala laddu
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రమైన లడ్డూ (Tirumala laddu)ప్రసాదాల తయారీకి సంబంధించిన నెయ్యి సరఫరాలో జరిగిన ఒక భారీ అవినీతి కుంభకోణం కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) ప్రభుత్వం హయాంలో, అంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో జరిగినట్లు ఆరోపించబడుతున్న ఈ ‘నకిలీ నెయ్యి’ స్కాంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. దేవాలయాల పవిత్రతను కలుషితం చేసి, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఈ వ్యవహారంపై రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.
ఈ అవినీతి కుంభకోణం 2024 సెప్టెంబర్‌లో, టీటీడీ లడ్డూ (Tirumala laddu)తయారీలో వాడిన నెయ్యిపై కొత్తగా అమలు చేసిన ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు వెల్లడి కావడంతో బయటపడింది. ల్యాబ్ నివేదికల ప్రకారం, నెయ్యిలో ప్రామాణికమైన శుద్ధమైన పాల నెయ్యికి బదులుగా పామాయిల్ (Palm Oil), వివిధ రసాయన ఎమల్సిఫైయర్‌లు (Chemical Emulsifiers), నిషేధిత జంతు కొవ్వులు (Animal Fat – Beef Tallow/Lard) వంటి వాహ్య పదార్థాలు (Adulterants) కలిపినట్టు స్పష్టంగా నిర్ధారించబడింది.
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో టీటీడీ వార్షిక టెండర్లలో ఎటువంటి ‘ప్యూర్ గీ’ (Pure Ghee) కొనుగోలు జరగలేదని, అసలు పాల ఉత్పత్తులైన పాలు లేదా బటర్ కొనుగోలు చేయకపోయినా, లెక్కకు మించి లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయినట్లు పక్కా ఆధారాలు దొరికాయి.
దర్యాప్తులో భాగంగా, మొత్తం 2019 నుంచి 2024 మధ్యకాలంలో సుమారు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయినట్లు, దీని విలువ సుమారు రూ. 250 కోట్ల మేర ఉంటుందని తేలింది. ఈ కుంభకోణం వెనుక ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ (ప్రమోటర్లు: పోమిల్ జైన్, విపిన్ జైన్) తో పాటు మరికొన్ని ప్రాక్సీ డెయిరీలు కీలకంగా వ్యవహరించాయి. వాటిలో వైష్ణవి డెయిరీ (తిరుపతి), ఏఆర్ డెయిరీ ఫుడ్స్ (దిండిగుల్), మరియు మాల్ గంగ డెయిరీ (ఉత్తర్ ప్రదేశ్) ఉన్నాయి.
ముఖ్యంగా, ఏఆర్ డెయిరీ 2022లోనే బ్లాక్‌లిస్ట్ చేయబడినా కూడా, ఇతర డెయిరీల పేరుతో టెండర్లలో మళ్లీ పాల్గొని, అదే నకిలీ నెయ్యిని రీఫైన్ చేసి, రీ-లేబుల్ చేసి సరఫరా చేసినట్లు రుజువైంది. గోదాముల్లో పామాయిల్, కెమికల్ ఎమల్సిఫైయర్‌లైన బీటా-కెరోటిన్, మోనోగ్లిసెరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన మోనోగ్లిసెరైడ్ కంటైనర్లు దొరకడం ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులను, నిషేధిత పదార్థాల వాడకాన్ని సూచిస్తోంది.
ఈ (Tirumala laddu)స్కాంలో ఢిల్లీ కెమికల్ ట్రేడర్ అజయ్ కుమార్ సుగంధ (A-16), భోలే బాబా డెయిరీ ప్రమోటర్లు, మధ్యవర్తులు , ఇతర డెయిరీల నిర్వాహకులు సహా దాదాపు 18 మందికిపైగా ప్రమేయం ఉన్నట్లు పేర్లు బయటపడ్డాయి. దీనికి అదనంగా, ఈ వ్యవహారంలో మాజీ టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సహా పలువురు మాజీ అధికారులను కూడా SIT విచారిస్తోంది.
ఈ(Tirumala laddu) నకిలీ నెయ్యి తయారీ, సరఫరా ఒప్పందాలు అంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని, కూటమి ప్రభుత్వ ఆక్షేపణలతో 2024 సెప్టెంబర్ తర్వాత కేసు విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల కార్పొరేట్ ఖాతాల్లోని బిల్లులను ఫ్రీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ, NDDB, CAG ల్యాబ్ రిపోర్టులు, బిల్లింగ్, ట్రాన్సాక్షన్ రికార్డులు ఈ స్కాంకు ప్రధాన ఆధారాలుగా నిలిచాయి.
కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తున్నామని చెబుతుండగా, వైఎస్ఆర్సీపీ వీటిని రాజకీయ నాటకంగా కొట్టిపారేస్తోంది. అయితే, డీఎన్‌ఏ-ల్యాబ్ రిపోర్ట్ , ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తింపు పొందిన నివేదికలు ప్రధాన సాక్ష్యాలుగా వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం ఈ కేసు తీవ్రతను పెంచుతోంది.
ప్రస్తుతం ఈ కేసు CBI పర్యవేక్షణలో SIT దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కొందరు నిందితులు అరెస్ట్ అయ్యారు, అక్రమాలకు పాల్పడిన డెయిరీలను బ్లాక్‌లిస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, టీటీడీ ఇప్పుడు మంచి నెయ్యి టెండర్ పాలసీ కోసం కొత్త SOPలు (Standard Operating Procedures) రూపొందిస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద దేవాలయ అవినీతి కేసుగా నిలిచింది
