Sankranthi travelers
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నీ వెయిటింగ్ లిస్ట్‌తో నిండిపోయాయి.దీంతో, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి విజయవాడ , సిర్పూర్ కాగజ్ నగర్ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
ముఖ్యమైన తేదీలు , సమయాలు– ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10 , 18వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ – విజయవాడ (07471).. ఈ రైలు జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6:10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1:40కి విజయవాడ చేరుకుంటుంది.
విజయవాడ – హైదరాబాద్ (07472).. జనవరి 9, 18 తేదీల్లో మధ్యాహ్నం 2:40 కి విజయవాడలో బయల్దేరి రాత్రి 10:35కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి.
సిర్పూర్ కాగజ్ నగర్ రూట్.. హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లు (07469/07470) కూడా జనవరి 9, 10, 18 తేదీల్లోనే అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:55కి బయల్దేరి మధ్యాహ్నం 2:15కి గమ్యస్థానానికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్ల వల్ల సంక్రాంతికి చివరి నిమిషంలో టికెట్లు దొరక్క ఇబ్బంది పడే సంక్రాంతి ప్రయాణికుల(Sankranthi travelers)కు పెద్ద ఊరట లభించబోతోంది.
