Nara Lokesh: ఇది కదా ఫ్యామిలీ టైమ్ అంటే..

Nara Lokesh: బిజీ షెడ్యూల్‌లోనూ తండ్రిగా లోకేష్ బాధ్యత: దేవాన్ష్ కోసం పేరెంట్స్ మీటింగ్‌కు హాజరు

Nara Lokesh

రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఉన్న ప్రముఖులు తమ కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు సమయం కేటాయించడం చాలా కష్టం. కానీ, ఎంత గొప్పస్థాయిలో ఉన్నా కూడా కుటుంబానికి సమయం కేటాయించినప్పుడే నిజమైన ‘ఫ్యామిలీ మ్యాన్’గా నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మంత్రి నారా లోకేష్(Nara Lokesh), ఇప్పుడు అదే పని చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా, తన కుమారుడు దేవాన్ష్‌ విషయంలో ఒక బాధ్యత గల తండ్రిగా తన ప్రేమను చాటుకున్నారు.

ఇటీవలే సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన లోకేష్(nara lokesh), వెంటనే తన కొడుకు దేవాన్ష్(Devansh) చదువుతున్న పాఠశాలలో జరిగిన పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. సాధారణంగా ఇలాంటి విషయాలను తల్లి బ్రాహ్మణి(Brahmani) చూసుకుంటారు. అయితే, ఈసారి కుమారుడు దేవాన్ష్ అడగడంతో.. లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఇద్దరూ కలిసి ఈ సమావేశానికి వెళ్లారు.

పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న తర్వాత లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన కుమారుడు, భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ, ఆ ట్వీట్‌ను షేర్ చేశారు. ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో.. ఇలాంటి క్షణాలు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. దేవాన్ష్, నువ్వు చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్ని ఇస్తున్నాయి. నిన్ను చూసి గర్వపడుతున్నాను దేవాన్ష్.. అని ట్వీట్ చేశారు.

nara lokesh with family

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక బిజీ రాజకీయ నాయకుడు, తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎంత విలువ ఇస్తున్నారో ఈ ట్వీట్ స్పష్టం చేసింది. తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తోంది. గతంలో, లోకేష్ తాను ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి హాజరైనప్పుడు తన కుమారుడి పాఠశాలకు వెళ్లలేదని బాధపడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దేవాన్ష్ కోరిక మేరకు వెళ్లి, తన తండ్రి ప్రేమను చాటుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యత గల తండ్రిగా కూడా ఆయన గుర్తింపును పెంచింది.

Also Read: Google :ఈ గుడ్ న్యూస్‌తో టెక్ డెస్టినేషన్‌గా వైజాగ్ ఫిక్స్..

 

Exit mobile version