Nara Lokesh :ట్రోల్స్ నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్ వరకు.. విమర్శల నుంచి విజయం వైపు.. నారా లోకేష్ బర్త్ డే స్పెషల్

Nara Lokesh : ప్రతి నాయకుడి జీవితంలో ఒక దశ ఉంటుంది. జనం కేవలం తప్పులు మాత్రమే చూసే దశ అది. లోకేష్ జీవితంలో కూడా అలాంటి కాలం గట్టిగానే వచ్చింది

Nara Lokesh

ఏ రంగంలో అయినా వారసత్వం అనేది ఎవరికైనా ఒక మెట్టు మాత్రమే. అది రాజకీయం అయినా, సినీ రంగం అయినా, వ్యాపార రంగం అయినా సరే. అయితే నీ ఆ మెట్టు ఎక్కి శిఖరాన్ని చేరుకోవాలంటే వారి నిజాయితీ, కష్టం, పట్టుదల,ట్యాలెంట్ అన్నీ ఉండాలి.అప్పుడే వారసుల స్థానం కూడా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది.

ఇప్పుడు నారా లోకేష్(Nara Lokesh ) ప్రూవ్ చేసుకున్నది అదే. ప్రతి నాయకుడి జీవితంలో ఒక దశ ఉంటుంది. జనం కేవలం తప్పులు మాత్రమే చూసే దశ అది. లోకేష్ జీవితంలో కూడా అలాంటి కాలం గట్టిగానే వచ్చింది.ఇంకా చెప్పాలంటే ఆ కాలం చాలా గట్టిగానే నడిచింది.

ఒకప్పుడు ఆయనను పప్పు అని ఎగతాళి చేసిన వారు, సోషల్ మీడియాలో పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని, మాటలను అత్యంత దారుణంగా పని గట్టుకుని మరీ ట్రోల్ చేశారు. కానీ ఆయన ఎక్కడా కుంగిపోలేదు. ఆ విమర్శలనే తన విజయానికి పునాదులుగా మార్చుకున్నారు.

లోకేష్ ప్రయాణాన్ని గమనిస్తే, ఆయన 2019లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు చాలామంది ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయిందని అన్నారు. మాట్లాడటమే సరిగా రాని వ్యక్తికి రాజకీయాలా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కొడుకు కాబట్టి ఇంత దూరం వచ్చాడు.. లేదంటే లోకేష్‌కి ఇంత వరకూ కూడా వచ్చే సీనే లేదన్నారు.

కానీ, ఆ ఓటమి, ఆ మాటలే ఆయనను మరింత బలంగా మార్చాయి. నిశ్శబ్దంగా తనని తాను మార్చుకోవడం మొదలుపెట్టారు. 4,000 కిలోమీటర్ల మేర సాగిన ‘యువగళం’ పాదయాత్ర ఆయనను ఒక సాఫ్ట్ లీడర్ నుంచి మాస్ లీడర్‌గా మార్చేసింది. మాటలు నేర్చుకున్నారు.

యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మార్చుకున్నారు. ఎండనక, వాననక ప్రజల మధ్య నడుస్తూ, వారి కష్టాలను స్వయంగా వింటూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఆ టైమును వాడుకున్నారు.

విషయాలు లోతుగా చదివారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకున్నారు. ప్రజల మధ్య ఉండడం అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు “సాఫ్ట్” అనిపించిన వ్యక్తి, ఇప్పుడు అసెంబ్లీలోనూ, బయటా చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నారు.

యువతతో మాట్లాడే స్టైల్ మారింది, సభల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. తప్పులు చేశానని ఒప్పుకున్నారు, విమర్శలు ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నారు.ఇంకా చెప్పాలంటే వాటినే తన ఇంధనంగా మార్చుకున్నారు. ఒక జోక్‌గా మొదలైన ప్రయాణం, ఇప్పుడొక ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

ఒకప్పుడు మైక్ ముందు మాట్లాడటానికి తడబడిన లోకేష్, ఇప్పుడు తన వాగ్ధాటితో ప్రత్యర్థులకు గట్టి సమాధానాలు ఇస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి మాట్లాడే శైలి వరకు అన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా మారాయి.

Nara Lokesh

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటి, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ (Nara Lokesh ) బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు అద్భుతం అని జిల్లాను, దేశాన్ని దాటి ఏకంగా ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకున్నారు.

రెడ్ బుక్ కాన్సెప్ట్ ద్వారా కార్యకర్తల్లో భరోసా నింపడం, స్కూళ్లలో విద్యా ప్రమాణాలను పెంచడం, ఐటి రంగంలో పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్న కృషి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏపీకి ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతారంటూ ఎగతాళి చేసిన నోళ్లే మెచ్చుకుంటున్నాయి.

అవును ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు అనే నీడ నుంచి బయటకు వచ్చి, తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని సంపాదించుకున్నారు. తప్పుల నుంచి పారిపోకుండా, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగడమే అసలైన నాయకత్వం అని ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచారు.

ఈ రోజు కేవలం ఆయన పుట్టినరోజు మాత్రమే కాదు, ఒక నాయకుడి పట్టుదలకు, నిరంతర ప్రయత్నానికి అది ఒక నిదర్శనం.అందుకే మన జస్ట్ తెలుగు (JustTelugu.in) తరపున నారా లోకేష్‌(Nara Lokesh ) కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Bangladesh:బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్.. 240 కోట్ల భారీ నష్టంతో పాటు బంగ్లాకు ఏం జరగనుంది?

Exit mobile version