Gold and Silver:4 గంటల్లోనే 5 వేలు పెరిగిన బంగారం! వెండి ఏకంగా 20 వేల జంప్!**

Gold and Silver: వెండి కేవలం పారిశ్రామిక లోహం మాత్రమే కాకుండా, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గా మారడంతో దాని ధరలు ఇలా పరుగులు తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Gold and Silver

బంగారం, వెండి (Gold and Silver)ధరలు మరోసారి సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చాయి. జనవరి 23, 2026 శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 5,400 పెరిగి రూ. 1,59,710 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,950 పెరిగి రూ. 1,46,400 వద్ద కొనసాగుతోంది.

వెండి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కిలో వెండిపై రూ. 20,000 పెరిగి రూ. 3,60,000 కి చేరుకుంది.గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని గంటల్లోనే ఇంత భారీ స్థాయిలో ధరలు పెరిగిన దాఖలాలు లేవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత , పెళ్లిళ్ల సీజన్ వల్ల ఏర్పడిన డిమాండ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,59,860 గా ఉండగా, చెన్నైలో రూ. 1,59,820 వద్ద కొనసాగుతోంది.

Gold and Silver

ఈ భారీ పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈరోజు ఉదయం కాస్త బంగారం, వెండి(Gold and Silver) ధరలు తగ్గాయని సంబరపడివారు ఇప్పుడు పెరుగుదల చూసి షాక్ కు గురవుతున్నారు.

వెండి కేవలం పారిశ్రామిక లోహం మాత్రమే కాకుండా, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గా మారడంతో దాని ధరలు ఇలా పరుగులు తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2026 చివరి నాటికి బంగారం ధరలు రూ. 2 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Nara Lokesh :ట్రోల్స్ నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్ వరకు.. విమర్శల నుంచి విజయం వైపు.. నారా లోకేష్ బర్త్ డే స్పెషల్

Exit mobile version