Liquor : కొత్త లిక్కర్ పాలసీ.. ఇక బార్‌లకు వెళ్లాల్సిన పనిలేదు

Liquor : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియుల కోసం కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Liquor

మందు బాబులకు ఏపీ కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఇకపై బార్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా..ఆంధ్రప్రదేశ్‌లో మద్యం (Liquor)ప్రియుల కోసం కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిషేధించిన పర్మిట్ రూమ్‌లను తిరిగి అనుమతిస్తూ, కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇకపై బార్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా, మద్యం షాపుల పక్కనే కూర్చుని సేవించే వెసులుబాటు లభించింది. ఈ నిర్ణయం ద్వారా బహిరంగంగా మద్యం సేవించే సమస్యకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

పర్మిట్ రూమ్‌లపై కొత్త పాలసీ ఎలా ఉందంటే..ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరిస్తూ, జీవో ఎంఎస్ నెంబర్ 273 ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్మిట్ రూమ్‌ల కోసం కొన్ని నియమ నిబంధనలు కూడా విధించారు.

2025-26 సంవత్సరానికి పర్మిట్ రూమ్ లైసెన్స్ కోసం నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్ ఫీజును రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆధారంగా నిర్ణయించారు.

liquor

రూ.55 లక్షల వరకు ట్యాక్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు, రూ. 65 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు ట్యాక్స్ ఉన్న వారికి రూ7.50 లక్షలు లైసెన్స్ ఫీజు ఉంటుంది.

పర్మిట్ రూమ్ ప్లింత్ ఏరియా 1,000 చదరపు అడుగులకు మించకుండా ఉండాలి. ఇది తప్పనిసరిగా మద్యం దుకాణం పక్కనే ఏర్పాటు చేయాలి.

పర్మిట్ రూముల్లో రెడీ టు ఈట్ స్నాక్స్‌కు మాత్రమే అనుమతి ఉంది, వంటలు చేయడానికి వీలు లేదు. అలాగే, తాగునీరు, చేతులు కడుక్కోవడానికి నీరు, టాయిలెట్ వంటి సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత లిక్కర్(Liquor) పాలసీని రద్దు చేసి కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్ విధానాన్ని తొలగించి, ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టింది.

అంతేకాకుండా, గతంలో తీసేసిన కొన్ని పాత మద్యం(Liquor) బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్పులన్నీ మందు ప్రియులను దృష్టిలో పెట్టుకుని చేసినవేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఈ మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడమే ఈ పర్మిట్ రూమ్‌ల ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.

 

Exit mobile version