Pawan Kalyan:డిప్యూటీ సీఎం,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా స్టెప్ వేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత, ఇప్పుడు ఆయన పూర్తిగా తన పార్టీ జనసేన మీద ఫోకస్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం..ఏపీ రాజకీయాలతో పాటు, అధికారంలో ఉన్న కూటమిలో కూడా ఒక కొత్త గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్న టాక్ నడుస్తోంది.
Pawan Kalyan
నిజానికి స్టార్ హీరోగా ఒక రేంజ్‌లో తన హవా చూపిస్తున్న ఆసమయంలో.. పవన్, రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అలా అని ఆయన పొలిటికల్ జర్నీ అంతా సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశారు.
2014లో జనసేన పార్టీని స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ, టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ ఇచ్చారు. అది ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్ అని అప్పట్లో చాలా మంది అన్నారు. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. పవన్ ప్రజల కష్టాలను బయటపెట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ, అప్పుడు పార్టీ అంత బలంగా లేదు. పైగా పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేకపోయారు. ఆ ఫలితాలే పవన్‌ను బాగా ఆలోచించేలా చేశాయి.
2019 నుంచి పవన్ చాలా నేర్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు, అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పవన్ గట్టిగా నిలదీశారు. ప్రజల కోసం పోరాడారు. ఈసారి ఒంటరిగా వెళ్లకూడదు, అందరినీ కలుపుకోవాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అందుకే, టీడీపీ, బీజేపీలతో కలిసి ఒక పవర్ఫుల్ కూటమిని ఏర్పాటు చేయగలిగారు.
చివరకు ఒక్క సీటు అయినా గెలిచి చూపించు అన్నవాళ్లతోనే ఈ ఎన్నికలలో నిలబడి..పోటీ చేసిన 21 స్థానాలలో 21 స్థానాలను గెలిచి హండ్రెడ్ పర్సంట్ సాధించారు. గట్టిగా అనుకుంటే ఏదైనా సాధిస్తాం అనే పదానికి పవన్ కళ్యాణ్ సాక్ష్యంగా నిలిచారు.
21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు గెలిచి, ఏపీ పాలిటిక్స్‌లో ‘కింగ్‌మేకర్’ జనసేన (Janasena)అయ్యేలా చేశారు. పవన్ స్వయంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని, తనకున్న క్రేజ్‌కు పొలిటికల్ పవర్‌ను కూడా యాడ్ చేసుకున్నారు. 13 నెలలుగా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఒక భాగం అయ్యారు. ఈ సమయంలో కూటమిలోని అందరితో కలిసి పని చేస్తూ, సమన్వయం చూపించారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం(Deputy CM )గా ఉన్నారు. కానీ, ఆయన ఫోకస్ అంతా జనసేన పార్టీ ఫ్యూచర్ మీదనే ఉంది. ‘రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మారినా, జనసేన సొంత బలం మీద నిలబడాలని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన మరోసారి పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఇంకొన్ని నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ కూడా ఏపీలో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. టీడీపీ అయితే తమ పాలన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్తోంది. దీంతో జనసేన పార్టీని కూడా మరింత యాక్టివ్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.
పవన్ కేవలం గెలిచిన 21 నియోజకవర్గాలకే పరిమితం కావడం లేదు. అదనంగా మరో 60 నియోజకవర్గాల్లో ఆయన స్వయంగా సర్వేలు చేయించుకున్నారు. ఈ సర్వేల రిపోర్ట్స్ చూశాక, 45 నియోజకవర్గాల్లో జనసేనకు మంచి సపోర్ట్ ఉందని తేలింది.
ఇది పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవ్‌కు చాలా ఇంపార్టెంట్ డేటా. దీని ఆధారంగానే రాబోయే ఎన్నికలకు పార్టీ ఎలా ప్లాన్ చేయాలో ఆయన డిసైడ్ అవుతున్నారు. అంతేకాదు, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారు, ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారు అని కూడా పవన్ తెలుసుకున్నారు.
ఈ క్షణాన ఎన్నికలు వచ్చినా జనసేన జెండా పట్టుకుంటే గెలుపు మాదే అనే నమ్మకం పార్టీలో రావాలని పవన్ అనుకుంటున్నారు. అందుకే,
త్వరలోనే ప్రతి జిల్లాకు పార్టీ అధ్యక్షులను నియమించడానికి రెడీ అవుతున్నారు. దీనివల్ల పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని పవన్ నమ్ముతున్నారు
గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి వెళ్లడానికి ‘ఇంటింటికీ జనసేన’ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా జనసేన ఆలోచనలు, ప్రభుత్వంలో జనసేన ఎలా పని చేస్తోంది, భవిష్యత్ ప్లాన్స్ ఏంటి అనేవి ప్రజలకు వివరిస్తారు.
పవన్ కేవలం డిప్యూటీ సీఎంగానే ఉండాలని అనుకోవడం లేదు. ఆయన ఫోకస్ అంతా రాష్ట్ర రాజకీయాల్లో జనసేనను ఓ బలమైన, స్వతంత్ర శక్తిగా నిలబెట్టడం. కూటమిలో ఉంటూనే, తన సొంత పార్టీ బలాన్ని పెంచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పరిస్థితి వచ్చినా జనసేన రెడీగా ఉండాలి అని పవన్ గట్టిగా అనుకుంటున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక మెచ్యూర్డ్ స్టెప్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ‘బిగ్ మూవ్’ ఎలాంటి టర్నింగులు తీసుకుంటుందో చూడాలి మరి.