Lokesh
తెలుగుదేశం పార్టీలో యువతరం నాయకుడిగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదుపరి పీఠం అధిష్టించబోయే నేతగా నారా లోకేష్ పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీలో నంబర్ 2 స్థానం దక్కించుకున్న లోకేష్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.దీంతో ఈ సాన్నిహిత్యం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కీలకంగా మారబోతోందా అన్న చర్చ నడుస్తోంది.
2014-19 మధ్యకాలంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఎక్కువగా తన తండ్రి చంద్రబాబు నాయుడుకే అధికార నిర్ణయాలు అప్పగించారు. కానీ, ఇప్పుడు లోకేష్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి, తర్వాత కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
లోకేష్(Lokesh) కేంద్రంలో మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి, కేంద్ర నిధుల సహకారం కోసం ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమిత్ షాతో లోకేష్ సమావేశమై రాష్ట్ర పరిస్థితులను వివరించారు. అలాగే, మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనల్లో లోకేష్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఇది కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను నిరూపిస్తుంది.
టీడీపీ యువత, మహిళా శక్తి, రైతుల సంక్షేమం, విద్య, ఉపాధి వంటి అంశాలపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించడానికి క్యాడర్ ఈజ్ లీడర్ వంటి నినాదాలు ఇచ్చి, పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లోకేష్‌ను భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తోంది. పార్టీలోని యువత, నాయకులతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, ప్రతి కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
లోకేష్(Lokesh)కు యువ నాయకత్వం, ఆధునిక విధానాలతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. కేంద్ర మంత్రులతో ఉన్న సంబంధాల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు, పెట్టుబడులు తీసుకురాగలుగుతున్నారు. అయితే, పార్టీలో సీనియర్ నాయకులతో అధికారం పంచుకునే విషయంలో, అలాగే జనసేన, బీజేపీ వంటి కూటమి పార్టీలతో పూర్తి స్థాయిలో సమన్వయం సాధించాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ టీడీపీలో భవిష్యత్ నేతగా, పార్టీని బలోపేతం చేసే నాయకుడిగా ఎదుగుతున్నారు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద బలం.