OTT: సెప్టెంబర్‌లో ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ లోడింగ్!
OTT: సెప్టెంబర్ నెలలో ఓటీటీలో యాక్షన్, రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్... ఇలా అన్ని జానర్ల సినిమాలు రెడీగా ఉన్నాయి.

OTT
ఓటీటీ(OTT)లో సెప్టెంబర్ నెల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది . ఎందుకంటే థియేటర్లో మిస్సైన ఫైర్, రొమాన్స్, థ్రిల్ అంతా ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఈ నెలలో ఓటీటీ(OTT)ని షేక్ చేయబోతున్న 5 టాప్ సినిమాల గురించి చూద్దాం!
1. సయ్యారా (Netflix – సెప్టెంబర్ 12)
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మ్యూజికల్ హిట్ ఇది. డైరెక్టర్ మోహిత్ సూరి, యశ్ రాజ్ ఫిలిమ్స్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో యంగ్ స్టార్స్ ఆహాన్ పాండే , అనీత్ పడ్డా అదుర్స్ అనిపించారు. 2025లో రెండో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. థియేటర్‌లో మిస్ అయితే, ఈసారి మీరు మిస్ అవ్వకండి!
2. మాలిక్ (Amazon Prime Video – సెప్టెంబర్ 5)
యాక్షన్, థ్రిల్, సస్పెన్స్ ఇష్టపడేవారికి ఇది పక్కా ట్రీట్! రాజ్‌కుమార్ రావ్ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ పుల్కిత్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. థియేటర్‌లో యావరేజ్‌గా ఆడినా, ఓటీటీ ఆడియన్స్ దీనికి భారీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో వచ్చే ఈ సినిమా కోసం సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

3. కూలీ (Amazon Prime Video – సెప్టెంబర్ 11)
లోకేశ్ కనగరాజ్ రైటింగ్, డైరెక్షన్‌తో, సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ లుక్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో రచ్చ చేసింది. నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర వంటి స్టార్ క్యాస్టింగ్, అమీర్ ఖాన్, పూజా హెగ్డేల స్పెషల్ ఎంట్రీ సినిమాకు మరో లెవల్ జోష్ ఇచ్చాయి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ సినిమా దుమ్ము రేపడం ఖాయం!
4. ఆంఖోం కి గుస్తాఖియాన్ (Zee5 – సెప్టెంబర్ 5)
రొమాన్స్ అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. శనాయా కపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయమైన ఈ సినిమా గురించి ఇప్పటికే మంచి బజ్ ఉంది. విక్రాంత్ మస్సే పర్ఫార్మెన్స్‌తో, అందమైన ప్రేమకథతో జీ5లో ఈ సినిమా ఎంటర్‌టైన్ చేయనుంది.
5. ఇన్‌స్పెక్టర్ జెండే (Netflix – సెప్టెంబర్ 5)
ఒక సీరియల్ కిల్లర్, ఒక ఇన్‌స్పెక్టర్.. ఈ కాంబోనే కిక్ ఇస్తుంది! మనోజ్ బాజ్‌పేయి ‘ఇన్‌స్పెక్టర్ మాధుకర్ జెండే’గా, జిమ్ సర్బ్ ఒక సీరియల్ కిల్లర్‌గా నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు టాప్ యాక్టర్స్ మధ్య జరిగే ఈ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
మొత్తంగా, ఈ సెప్టెంబర్ నెలలో ఓటీటీ(OTT)లో యాక్షన్, రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్… ఇలా అన్ని జానర్ల సినిమాలు రెడీగా ఉన్నాయి. సో, ఈ నెల మొత్తం మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫుల్ గ్యారంటీ! ఎంజాయ్ చేయండి!
One Comment