SSC
ఏపీలోని పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. విద్యాశాఖ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమై, ఏప్రిల్ 1వరకు కొనసాగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలకమైన పరీక్షలకు సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(SSC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేవలం తేదీలే కాకుండా, పరీక్షా సమయాలు, నిబంధనలపై కూడా అధికారులు స్పష్టతనిచ్చారు.
పరీక్షల టైమ్ టేబుల్ :
మార్చి 16- ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్దూ/ఇతర)
మార్చి 18- సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 20- ఇంగ్లిష్
మార్చి 23-గణితం (మాథ్స్)
మార్చి 25- ఫిజికల్ సైన్స్ (భౌతిక శాస్త్రం)
మార్చి 28-బయాలజికల్ సైన్స్ (జీవ శాస్త్రం)
మార్చి 30-సోషల్ స్టడీస్ (సాంఘిక శాస్త్రం)
పరీక్షా సమయాల విషయానికి వస్తే, ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, సైన్స్ పరీక్షలకు మాత్రం సమయం తక్కువగా ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మాత్రమే జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల వల్ల అవసరమైతే ఈ టైమ్ టేబుల్‌లో మార్పులు ఉండొచ్చని బోర్డు(SSC) తెలిపింది. అలాగే, మాల్‌ప్రాక్టీస్‌కు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇక పరీక్షలకు దాదాపు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని సూచనలు..
1. టైమ్ టేబుల్ వేసుకోండి– పరీక్షల మధ్య ఉన్న సెలవులను దృష్టిలో పెట్టుకుని, కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించేలా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి.
2. రివిజన్ ముఖ్యం- కొత్త పాఠాలు చదవుతూనే.. ఇప్పటికే చదివిన వాటిని రివిజన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ కనీసం రెండు గంటల సమయం రివిజన్ కోసమే కేటాయించాలి.
3. ప్రీవియస్ పేపర్స్- గత మూడేళ్ల పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల.. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో అవగాహన వస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
4. సమయపాలన- కేవలం చదవడం మాత్రమే కాదు, నిర్ణీత సమయంలో సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్. దీనివల్ల పరీక్షలో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రాయొచ్చు.
5. ఆరోగ్యంపై శ్రద్ధ- చదువు ఎంత ముఖ్యమో, నిద్ర , పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యం. రాత్రుళ్లు ఎక్కువ సమయం మేల్కోకుండా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీ నిద్రను ప్లాన్ చేసుకోవాలి. .
పదో తరగతి పరీక్షలు అనేవి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబట్టి.. భయం వదిలేసి, ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వం నిబంధనలను కఠినం చేసినా, నిజాయితీగా కష్టపడితే మంచి ఫలితం తప్పకుండా దక్కుతుంది.
Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?
