Business Ideas :తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే బిజినెస్ ఐడియాలు..!

Business Ideas : హోటల్ ఫుడ్ కంటే ఇంటి భోజనం రుచిని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది.

Business Ideas

కొత్త ఏడాదిలో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి 2026 అనేక కొత్త అవకాశాలను తెస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ, ప్రజల లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ కొన్ని వ్యాపారాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యాపారాలలో మొదటిది హైపర్ లోకల్ డార్క్ స్టోర్. బ్లింకిట్, జెప్టో వంటి కంపెనీలు సిటీలకే పరిమితమయ్యాయి. మీరు కూడా మీ ఊరిలోనో, మీ ఏరియాలోనో కిరాణా ,మందులు, వెజిటబుల్స్ డెలివరీ చేసే చిన్నపాటి స్టోర్లను ప్రారంభించి భారీ లాభాలు గడించొచ్చు.

Business Ideas

రెండోది క్లౌడ్ కిచెన్. హోటల్ ఫుడ్ కంటే ఇంటి భోజనం రుచిని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొద్ది మంది పనివాళ్లతో చిన్న క్లౌడ్ కిచెన్ సెటప్ పెట్టుకుని.. శుభ్రంగా వంట చేసి ఆన్‌లైన్ డెలివరీ యాప్స్ ద్వారా విక్రయించడం ద్వారా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.

Business Ideas-cloud-kitchen

మూడో బిజినెస్ ఐడియా ఈ-వేస్ట్ మేనేజ్మెంట్. పాత ఫోన్లు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు పంపడం ద్వారా మంచి కమిషన్ పొందొచ్చు. ఇది చాలామందికి తెలీదు. దీని గురించి గూగుల్‌లో కాస్త ఇన్ఫర్మేషన్ సంపాదించి ఈ పని చేస్తే పెద్దగా పెట్టుబడి లేకుండానే డబ్బులు బాగానే సంపాదించొచ్చు.

Business Ideas

నాలుగవది హోమ్ బ్యూటీ సర్వీసెస్. బ్యూటీ పార్లర్‌కు వెళ్లే సమయం లేని మహిళల కోసం డోర్ స్టెప్ బ్యూటీ సర్వీస్ ప్రారంభించడం ఇప్పుడు పెద్ద ట్రెండ్. ఇప్పటికే ఎస్ మేడమ్, అర్బన్ కంపెనీ వంటివి ఇలాంటి సర్వీసులతో మహిళలకు బాగా రీచయిపోయింది. మీరు కూడా తక్కువ ఇలా మీ ఏరియాలో స్టార్ట్ చేసి హోమ్ సర్వీస్ ఇస్తే బాగుంటుంది.

Business Ideas

ఐదోది వర్మికంపోస్ట్ (వానపాముల ఎరువు). ఆర్గానిక్ వ్యవసాయం గురించి అందరిలో ఆసక్తి పెరుగుతుండటంతో సహజ సిద్ధమైన ఎరువులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.

Business Ideas

కేవలం 50 వేల పెట్టుబడితో ఇంటి వెనుక ఖాళీ స్థలంలోనో లేక వేరే కొంచెం స్థలం లీజుకు తీసుకునో దీనిని ప్రారంభించి మంచి ఆదాయం పొందొచ్చు. ఈ 2026 లో నైపుణ్యం ,కొంచెం కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా సరే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారొచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version