Gold and silver prices
కొంతకాలంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు ధరలు పెరుగుతుంటే, మరో రోజు తగ్గుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో 24 క్యారట్ల బంగారం ధరపై దాదాపు రూ.6,000కు పైగా తగ్గుదల కనిపించగా, అదే సమయంలో సుమారు రూ.3,500 వరకు పెరుగుదల కూడా నమోదవడం కొనుగోలుదారుల్లో ఆందోళన పెంచుతోంది .కాకపోతే ఈ రోజు బంగారం ధర స్థిరంగా ఉంది.
అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా విధించే సుంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు,, డాలర్ విలువ వంటి అంశాలు బంగారం ధరలను ప్రధానంగా ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు సన్నగిల్లడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాబోయే వారం రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఐదు డాలర్లు పెరగ్గా, ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ $4,065 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతోపాటు తదితర ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 వద్ద ఉండగా, 24 క్యారట్ల పసిడి ధర రూ.1,25,840కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,15,500గా ఉండగా, 24 క్యారట్ల ధర రూ.1,25,990కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,15,350 వద్ద, 24 క్యారట్ల ధర రూ.1,25,840 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు (Gold and silver prices)కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.1,72,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,64,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.1,64,000 వద్దకు చేరింది.
పైన పేర్కొన్న ధరలు(Gold and silver prices) మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ మరియు దేశీయ పరిస్థితులను బట్టి ఈ బంగారం, వెండి రేట్లలో మార్పులు ఉండొచ్చని కొనుగోలు దారులు గమనించాలి.
