Disruptive innovation
వ్యాపార ప్రపంచంలో (Business World) తరచుగా వినిపించే పదం ‘డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్’ (Disruptive Innovation). ఇది కేవలం ఒక కొత్త ఉత్పత్తిని (New Product) లేదా సేవను (Service) మార్కెట్‌లోకి తీసుకురావడం కాదు. ఇప్పటికే ఉన్న, ఆధిపత్యం చెలాయిస్తున్న టెక్నాలజీలు, వ్యాపార నమూనాలను లేదా మార్కెట్ లీడర్‌లను పూర్తిగా పాతదిగా (Obsolete) మార్చివేసే ఆవిష్కరణ ఇది. క్లేటన్ క్రిస్టెన్సెన్ (Clayton Christensen) అనే హార్వర్డ్ ప్రొఫెసర్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు.
సాధారణంగా, మార్కెట్‌లో ఉన్న పెద్ద కంపెనీలు తమ ప్రస్తుత లాభదాయకమైన వినియోగదారులపై (Profitable Customers) మాత్రమే దృష్టి పెడతాయి. దీని ద్వారా తక్కువ రాబడినిచ్చే కొత్త లేదా చిన్న మార్కెట్‌లను (Niche Markets) విస్మరిస్తాయి. డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్ అనేది ఈ చిన్న మార్కెట్‌లో తక్కువ ధరతో, సరళమైన (Simpler) ,మరింత అందుబాటులో ఉండే ఉత్పత్తి లేదా సేవగా ప్రారంభమవుతుంది.
ఉదాహరణకు, మొదట్లో పర్సనల్ కంప్యూటర్లు (PCs) మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ల (Mainframe Computers) కంటే శక్తివంతమైనవి కావు, కానీ అవి చిన్న వ్యాపారాలకు, గృహ వినియోగదారులకు చవకగా అందుబాటులోకి వచ్చాయి. కాలక్రమేణా, ఈ పర్సనల్ కంప్యూటర్లు మెరుగై, చివరకు పెద్ద మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్‌ను ఆక్రమించాయి.
డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్‌కు ఆధునిక ఉదాహరణలు..
- స్ట్రీమింగ్ సర్వీసులు.. సంప్రదాయ కేబుల్ టీవీ , వీడియో రెంటల్ స్టోర్లను (Blockbuster) భర్తీ చేయడం.
- షార్ట్ ఫార్మాట్ కంటెంట్ .. సంప్రదాయ మీడియా వినియోగ అలవాట్లను మార్చడం.
- ఎలక్ట్రిక్ వాహనాలు .. పెట్రోల్ ఆధారిత వాహనాల మార్కెట్‌ను సవాల్ చేయడం.
డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్ వలన పెద్ద కంపెనీలకు ముప్పు ఉన్నా కూడా, ఇది వినియోగదారులకు మెరుగైన విలువను (Better Value), కొత్త అవకాశాలను మరియు మార్కెట్‌లో ఎక్కువ పోటీని సృష్టిస్తుంది. ఇది వ్యాపారాలను ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మలచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది.
