Gold and Silver : బంగారం,వెండి కొనాలనుకునేవారికి వరుస షాక్‌లు..దూసుకెళ్తున్న పసిడి ధరలు

Gold and Silver: అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేటు భారీగా పెరగడంతో.. మన దేశీయ ధరలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

Gold and Silver

గోల్డ్, సిల్వర్ (Gold and Silver )కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు బంగారం, వెండి ధరలు షాకింగ్ న్యూస్ వినిపించాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా వీటి ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల క్రితం వరకు కాస్త తగ్గుతూ వచ్చిన పుత్తడి,సిల్వర్(Gold and Silver) రేట్లు.. మళ్లీ మెల్లగా జంప్ అవుతున్నాయి.

ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడిపై ఏకంగా 2,900 రూపాయలు పెరిగిపోగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడిపై 3,160 రూపాయల వరకూ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేటు భారీగా పెరగడంతో.. మన దేశీయ ధరలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్కడ ఔన్సు గోల్డ్ ధర 122 డాలర్లు పెరిగి.. 5,043 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శనివారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,64,730 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,51,000 రూపాయల వద్ద ఉంది.

Gold and Silver

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం 1,64,880 రూపాయలు ఉండగా, చెన్నైలో ఎక్కువగా 1,65,820 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, కోల్‌కతాలో కూడా పుత్తడి ధరలు లక్షా అరవై వేల మార్కును దాటేశాయి.

బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా ఊహించనంత వేగంగా పెరుగుతోంది. 2 రోజులుగా నిలకడగా ఉన్న వెండి ధర, ఈరోజు ఒక్కసారిగా కిలోపై 5,000 రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా 3,00,000 రూపాయల రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి అన్ని మెట్రో నగరాల్లోనూ వెండి ఇదే జోరును కొనసాగిస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version