Financial planning:జీవితం సాఫీగా సాగాలంటే.. ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరి

Financial planning:మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఉదాహరణకు, మీ ఆదాయంలో 25 శాతం పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, అది సాధ్యమవుతుంది.

Financial planning

ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక(Financial planning) ఎంతో అవసరం. సరైన ప్లానింగ్ లేకపోతే, నెలవారీ ఖర్చులు, ఆదాయం మధ్య సమన్వయం కుదరక జీవితం గందరగోళంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి, భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంటుంది. అయితే, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ఈ ప్లానింగ్ దెబ్బతినవచ్చు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఉదాహరణకు, మీ ఆదాయంలో 25 శాతం పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, అది సాధ్యమవుతుంది. కానీ 50 శాతం పెట్టుబడి పెట్టి, మిగతా దానితోనే ఖర్చులన్నీ నిర్వహిస్తామంటే అది చాలా సందర్భాలలో అసాధ్యం కావచ్చు. ఇలాంటి అంచనాలతో ప్రణాళిక రచించినా అది విఫలమవుతుంది. అలాగే, కోరికలకు దూరంగా ఉండటం ముఖ్యం.

Financial planning

మీ పిల్లల భవిష్యత్తు కోసం నెలకు రూ.10,000 పొదుపు చేయాలని అనుకున్నప్పుడు, కారు కొనుగోలు లాంటి కోరికలను వాయిదా వేసుకోవడం తెలివైన పని. లేకపోతే మీ ప్రధాన లక్ష్యం దెబ్బతింటుంది. ఆర్థిక ప్రణాళికలోక్రమశిక్షణ లేకపోవడం మరో ప్రధాన సమస్య. ఆదాయం పెరిగినప్పుడు కొంత ఖర్చు పెరగడం సహజం. అదే సమయంలో పెట్టుబడులను కూడా పెంచుకోవాలి. అనవసరమైన ఖర్చులకు సిప్ (SIP) వంటి పెట్టుబడులను ఆపేయడం సరికాదు.

Financial planning

ఏడాదికి ఒకసారి అయినా మీ ఆర్థిక ప్రణాళిక(Financial planning)ను సమీక్షించుకుని, ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి, వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. అనారోగ్యం, ఉద్యోగ నష్టం వంటి అనుకోని పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి, కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలి.

లేకపోతే అనుకోని అవసరం భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులను వెనక్కి తీసుకునేలా చేయవచ్చు. ఆర్థిక ప్రణాళిక ఒక రోజులో పూర్తయ్యేది కాదు, ఇది నిరంతరంగా మారుతూ ఉంటుంది. మారుతున్న కాలం, అవసరాలు, జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా మార్పులు తప్పనిసరి. అవసరమైతే, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

Sensor: మీ ఫోన్‌లో ఏ సెన్సార్ దేనికి పనిచేస్తుందో తెలుసుకోండి

Exit mobile version