Gold
ఇటీవల బంగారం(Gold) ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఇప్పుడు వెండి ధర సైతం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఇవాళ (సోమవారం) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
వెండి ధరల సంచలనం (సిల్వర్ ప్రైస్)..
ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. గత 10 రోజుల్లో కిలో వెండి ధర ఏకంగా సుమారు రూ. 35,000 పెరిగింది. ఇది వినియోగదారులకు ఊహంచని స్థాయిలో ఉన్న పెరుగుదల. ఇవాళ కిలో వెండి ధర రూ. 1,95,000కి చేరింది. మరో రెండు రోజుల్లో ఇది రూ. 2 లక్షలకు చేరేందుకు సిద్ధంగా ఉంది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.320, 22 క్యారట్ల బంగారంపై రూ. 300 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 40 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 4,057 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం(Gold) ధరలు (10 గ్రాములకు)..నగరం 22 క్యారట్లు (పసిడి) 24 క్యారట్లు (బంగారం)
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం రూ. 1,14,950 రూ. 1,25,400
ప్రధాన నగరాల్లో నేటి వెండి ధరలు (కిలోకు)..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై రూ. 1,95,000
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు రూ. 1,85,000
పైన పేర్కొన్న ధరలు ప్రారంభంలో ఉన్నవి మాత్రమే, బంగారం మరియు వెండి రేట్లు మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మారుతూ ఉంటాయి.