Gold and Silver:బంగారం ప్రియులకు బొనాంజా.. కుప్పకూలిన పసిడి, వెండి ధరలు

Gold and Silver: హైదరాబాద్‌లో కేజీ వెండి ధర సుమారు రూ. 20,000 వరకూ తగ్గి రూ. 3 లక్షల వద్ద కొనసాగుతోంది

Gold and Silver

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2న హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు దారుణంగా పడిపోయాయి. ఒకేరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 9,000 నుంచి రూ. 10,000 వరకు తగ్గుదల కనిపించడంతో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌ మార్కెట్‌లో ఆదివారం రూ. 1,60,580 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, సోమవారం ఉదయానికి రూ. 1,51,530కి చేరుకుంది. అంటే కేవలం 24 గంటల వ్యవధిలోనే రూ. 9,050 పడిపోయింది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ. 8,300 వరకూ తగ్గి ప్రస్తుతం రూ. 1,38,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం కంటే వెండి(Silver) ధరల్లో మరీ పతనం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర ఒకే రోజులో రూ. 50,000 వరకూ కుప్పకూలింది. నిన్న రూ. 3.50 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి, ఈరోజు రూ. 3 లక్షల మార్కుకు చేరుకుంది. ఇక దక్షిణ భారత దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర సుమారు రూ. 20,000 వరకూ తగ్గి రూ. 3 లక్షల వద్ద కొనసాగుతోంది

బడ్జెట్ తర్వాత మార్కెట్లలో పసిడి, వెండి (Gold And Silver) ఈ స్థాయి పతనానికి కేవలం బడ్జెట్ ప్రకటనలే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడయ్యాయి.

ప్రాఫిట్ బుకింగ్.. కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవడంతో, బడ్జెట్ సమయంలో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను స్వీకరించడం (Profit Booking) మొదలుపెట్టారు.

Gold and Silver

అమెరికా డాలర్ బలోపేతం.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగింది.
బడ్జెట్ అంచనాలు..దిగుమతి సుంకాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో పాటు మార్కెట్లోని అస్థిరత ధరల తగ్గుదలకు దారితీశాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర అతి ఎక్కువగా రూ. 10,370 మేర పడిపోయి రూ. 1,52,180కి చేరింది. బెంగళూరులో కూడా వెండి ధరలు భారీగా క్షీణించి రూ. 3 లక్షలకు దిగొచ్చాయి. అయితే ధరలు తగ్గుతున్నా కూడా, ఇవి ఇంకా స్థిరపడలేదని, మార్కెట్ ఒడిదొడుకుల వల్ల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తానికి పసిడి కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం అనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేదా ఇక్కడితో ఆగుతాయా అన్నది మార్కెట్ నిపుణులు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారనే చెప్పాలి.

Bloating: కడుపు ఉబ్బరం సమస్యకు కారణాలేంటి?దీనికి చెక్ పెట్టడం ఎలా?

Exit mobile version