Gold
సోమవారం దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం(Gold), వెండి(silver) ధరల్లో ఊహించని విధంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక, భౌగోళిక పరిణామాలతో పసిడి ధర ఒక్కసారిగా పెరిగింది. ఈ పెరుగుదల సాధారణం కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.
ఈ రోజు ఉదయం నమోదైన వివరాల ప్రకారం, దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం(Gold)పై ఏకంగా రూ. 1,200 పెరిగింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,100 మేర పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,12,950 వద్దకు చేరగా, 24 క్యారెట్ల ధర రూ. 1,23,220 కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,100 కాగా, 24 క్యారట్ల ధర రూ. 1,23,370గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా తెలుగు రాష్ట్రాల మాదిరిగానే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,12,950 కాగా, 24 క్యారట్ల ధర రూ. 1,23,220 వద్ద నమోదైంది.
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న భారీ మార్పులే అని తెలుస్తోంది. సోమవారం ఒక్కరోజే ఔన్సు బంగారంపై 71 డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 4,072 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరతో పాటు వెండి ధర కూడా సోమవారం రోజున భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2,000 మేర పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదలతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 1,67,900 వద్దకు చేరింది.
అయితే, దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,55,000 వద్ద కొనసాగుతోంది. మొత్తం మీద, ఒక్కరోజులోనే బంగారం , వెండి ధరల్లో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడం, మార్కెట్లలో పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తోంది.
