Gold rate:ఈరోజు బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?

Gold rate :ఆగస్టు 23న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుండటంతో వినియోగదారులు అయోమయంలో పడుతున్నారు

Gold rate

బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం వినియోగదారుల్లో ఆశలు రేపుతోంది. ఇటీవల రూ.1,05,000 మార్కుకు చేరువైన పసిడి ధరలు.. ఇప్పుడు లక్ష రూపాయల దగ్గరకు వచ్చాయి. తాజాగా, ఆగస్టు 23న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుండటంతో వినియోగదారులు అయోమయంలో పడుతున్నారు.

చాలా మంది బంగారం ధర (Gold rate) తులం రూ.90,000 వరకు దిగి వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, అది సాధ్యం కానట్లుగా కనిపిస్తోంది. తగ్గినట్లుగానే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరలు ఉదయం నమోదైనవి మాత్రమే, రోజులో ధరలు మారే అవకాశం ఉంది.

Gold rate

ప్రధాన నగరాల్లో ఆగస్టు 23న బంగారం ధరలు (Gold rate)..ఢిల్లీలో:24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ. 1,00,670, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ. 92,290

ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలలో..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ. 1,00,520,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ. 92,140

ఇటు బంగారం ధర తగ్గుతున్నా వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,18,100 వద్ద కొనసాగుతోంది.వెండి రేట్లు కూడా ఒక రోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజు భారీగా పెరుగుతూ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ధరలు ఉదయం నమోదైనవి మాత్రమే, రోజులో ధరలు మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version